న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీసేన

By Nageshwara Rao
 India extend lead at the top of ICC Test Team Rankings

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 125 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఐదు పాయింట్లు కోల్పోయి 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.

మే 1, 2018 నాటికి భారత్, దక్షిణాఫ్రికా మధ్య 13 పాయింట్ల అంతరం ఉంది. టీమిండియాను చేరుకోవాలంటే మిగతా జట్లు అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. 106 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్ధానంలో కొనసాగుతుంది. 2014-15 ఏడాది ఫలితాలను పక్కనబెట్టి 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ వార్షిక ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది.

దీంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియాకు మధ్య అంతరం 4 పాయింట్లు ఉండేది. తాజా ర్యాంకులతో దక్షిణాఫ్రికాకు, భారత్ మధ్య అంతరం 13 పాయింట్లకు పెరిగింది. 102 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉండగా, 98 పాయింట్లతో ఇంగ్లాండ్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది.

ICC Test Team Rankings (as on May 1, 2018):
1. India - 125 points (+4 points)
2. South Africa - 112 points (-5 points)
3. Australia - 106 points (+4 points)
4. New Zealand - 102 points
5. England - 98 points (+1 point)
6. Sri Lanka - 94 points (-1 point)
7. Pakistan - 86 points (-2 points)
8. Bangladesh - 75 points (+4 points)
9. Windies - 67 points (-5 points)
10. Zimbabwe - 2 points (+1 point)

Story first published: Tuesday, May 1, 2018, 15:01 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X