న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సినీనటి ఆశ్రిత శెట్టితో వివాహం.. ఓ ఇంటివాడైన మనీష్‌ పాండే!!

Manish Pandey Ties Knot With Actress Ashrita Shetty || Oneindia Telugu
India cricketer Manish Pandey Marries Actress Ashrita Shetty In Mumbai


ముంబై: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. సినీనటి ఆశ్రిత శెట్టిని మనీష్ పాండే సోమవారం పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయ ప్రకారమే వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్‌లో ఘనంగా జరిగింది. మనీష్‌-ఆశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు: 6 వికెట్లు.. 0 పరుగులు!!టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు: 6 వికెట్లు.. 0 పరుగులు!!

నూతన దంపతులకు శుభాకాంక్షలు:

నూతన దంపతులకు శుభాకాంక్షలు:

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో మనీష్‌-ఆశ్రిత పెళ్లి ఫొటోను పోస్ట్‌ చేసింది. 'మనీష్‌-ఆశ్రితలకు శుభాకాంక్షలు. మీకు ఆనందం, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాం' అని రాసుకొచ్చింది. ఐపీఎల్‌లో మనీష్‌ పాండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దంపతులకు కర్ణాటక క్రికెట్‌ జట్టు కూడా శుభాకాంక్షలు తెలిపింది.

స్టేడియం బయట బంతి:

స్టేడియం బయట బంతి:

ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో తమిళనాడుపై అద్భుత విజయం సాధించిన కర్ణాటక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది. ముస్తాక్‌ అలీ ట్రోఫీని కర్ణాటక వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. కెప్టెన్ మనీష్‌ పాండే (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో రాణించడంతో.. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో పాండే బాదిన ఓ సిక్సర్‌ స్టేడియం బయట పడింది.

 తెళికెడా బొల్లితో తెరంగేట్రం:

తెళికెడా బొల్లితో తెరంగేట్రం:

ముంబైకి చెందిన 26 ఏళ్ల అర్షిత తుళు భాషలో 'తెళికెడా బొల్లి' సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ఉదయం ఎన్‌హెచ్‌4' ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంద్రజిత్, ఓరు కన్నియం మూను కలవనికలం వంటి హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆర్‌.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో 'నాన్‌ దా శివ' చిత్రంలో నటిస్తోంది.

 23 వన్డేలు, 32 టీ20లు:

23 వన్డేలు, 32 టీ20లు:

మనీష్ పాండే భారత్ తరఫున 23 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో మనీష్ సగటు 36.7గా ఉండగా.. టీ20 ఫార్మాట్‌లో 39.1 గా ఉంది. వన్డేల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేసాడు. టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 440 పరుగులు.. టీ20ల్లో 587 పరుగులు చేసాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు.

Story first published: Monday, December 2, 2019, 19:08 [IST]
Other articles published on Dec 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X