న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు హెచ్చరిక: జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకుంటాం

India chief selector MSK Prasad impressed with Rishabh Pants batting, but wants youngster to do better with gloves

హైదరాబాద్: పదే పదే అవకాశాలు లభిస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న భారత ఆటగాళ్లకు ప్రధాన సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ హెచ్చరికలు జారీ చేశాడు. 'తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై మేం దృష్టిపెట్టాల్సివుంటుంది' అని చెప్పాడు. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌ తననెంతో ఆకట్టుకుందని అన్నాడు.

పంత్‌ వికెట్‌ కీపింగ్ మెరుగుపడాలి

పంత్‌ వికెట్‌ కీపింగ్ మెరుగుపడాలి

‘ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో పంత్‌ బ్యాటింగ్‌ నాకు సంతోషాన్ని కలిగించింది. నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగ్‌ నైపుణ్యంపై నాకెప్పుడూ ఎలాంటి అనుమానమూ లేదు. అతడి వికెట్‌ కీపింగే మెరుగుపడాలి' అని అన్నాడు. ఆసియాకప్‌లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తామని ప్రసాద్‌ చెప్పాడు.

మయాంక్‌ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం

మయాంక్‌ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం

భారత్‌-ఏ తరఫున, దేశవాళీల్లో, విదేశాల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం వస్తుందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. అతడు తమ దృష్టిలో ఉన్నాడని పేర్కొన్నారు. గత సీజన్‌లో దేశవాళీల్లో కర్ణాటక ఆటగాడు మయాంక్‌ 2,141 పరుగులు సాధించడం విశేషం. ఈ మధ్యనే మెరిసిన పృథ్వీషా, రిషబ్‌ను టీమిండియాకు ఎంపిక చేసిన సెలక్టర్లు మయాంక్‌ను దూరం పెడుతుండటం గమనార్హం.

ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతున్నా

ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతున్నా

‘మా సెలక్షన్‌ కమిటీ దేశవాళీ ప్రదర్శనలపై కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది. మయాంక్‌ అగర్వాల్‌ ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి ప్రతిభను మేం గుర్తించాం. అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కర్ణాటక ప్రధాన కోచ్‌, సహాయక కోచ్‌కు సూచించాం. చాన్నాళ్లుగా మాయంక్‌ను గమనిస్తున్నాం. బాగా ఆడుతున్నాడు. త్వరలోనే అతడికి అవకాశం వస్తుంది' అని ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు.

కెప్టెన్‌గా విజయ్‌ హజారే గెలిచి:

కెప్టెన్‌గా విజయ్‌ హజారే గెలిచి:

గత సీజన్‌ రంజీ ట్రోఫీలోనే మయాంక్‌ 105.46 సగటుతో 1,160 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా విజయ్‌ హజారే గెలిపించిన అతడు మూడు సెంచరీలు బాదేశాడు. ఐపీఎల్‌లో సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన వాటిని ఉపయోగించుకో లేకపోయాడు. ఈ మధ్యనే జరిగిన దక్షిణాఫ్రికా-ఏపై 220 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా-ఏపై అర్ధశతకాలు బాదేశాడు.

Story first published: Monday, September 17, 2018, 11:52 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X