న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

India break Australia’s world record with massive win over Bangladesh in 2nd T20I at Rajkot

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో ఓ ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గతంలో నెలకొల్పిన రికార్డుని బద్దలు కొట్టింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

టీ20ల్లో ఛేదనలో టీమిండియాకు ఇది 41వ విజయం. 61వ సార్లు టీమిండియా ఛేజింగ్‌కు దిగగా ఇందులో 41సార్లు విజయం సాధించింది. ఫలితంగా 40 విజయాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రికార్డుని టీమిండియా అధిగమించింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు 69సార్లు రెండో బ్యాటింగ్‌ దిగి 40 సార్లు విజయం సాధించడం విశేషం.

2nd T20Iలో రోహిత్ విధ్వంసం: చిత్తుగా ఓడిన బంగ్లా, సిరిస్ 1-1తో సమం2nd T20Iలో రోహిత్ విధ్వంసం: చిత్తుగా ఓడిన బంగ్లా, సిరిస్ 1-1తో సమం

ఆస్ట్రేలియాతో పోలిస్తే తక్కువ మ్యాచ్‌ల్లో

ఆస్ట్రేలియాతో పోలిస్తే తక్కువ మ్యాచ్‌ల్లో

అంతేకాదు ఆస్ట్రేలియాతో పోలిస్తే తక్కువ మ్యాచ్‌ల్లోనే టీమిండియా ఈ రికార్డుని సాధించడం విశేషం. ఇదిలా ఉంటే, రెండో టీ20లో 85 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మ సైతం అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(37) బాదిన కెప్టెన్‌గా ఆటగాడిగా నిలిచాడు.

ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని(34) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ధోని 62 ఇన్నింగ్స్‌లో ఈ రి​కార్డుని నెలకొల్పగా.... రోహిత్‌ శర్మ కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు బాదడం విశేషం. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును సమం చేశాడు.

కోహ్లీ రికార్డుని సమం చేసిన రోహిత్

కోహ్లీ రికార్డుని సమం చేసిన రోహిత్

టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(22) హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా, కోహ్లీ రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. కెప్టెన్‌గా వీరిద్దరూ ఆరు హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో పాటు తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌ వరుసగా మూడో ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

టీ20ల్లో నాలుగో సారి శిఖర్‌ ధావన్‌తో కలిసి

టీ20ల్లో నాలుగో సారి శిఖర్‌ ధావన్‌తో కలిసి

టీ20ల్లో నాలుగో సారి శిఖర్‌ ధావన్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గతంలో కోహ్లీతో కలిసి మూడు సార్లు వందకు పైగా భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Friday, November 8, 2019, 12:10 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X