న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: అందుకే హార్దిక్ పాండ్యాకు బదులు శార్దూల్ ఠాకుర్‌కు చాన్స్!

India bowling coach Bharat Arun says Shardul Thakur has proved he can be an all-rounder

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్‌గా తన సత్తాను నిరూపించుకోవడంతోనే శార్దూల్ ఠాకుర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశామని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. ఇక బౌలింగ్ చేయలేకపోవడం వల్లే బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టామని స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతున్నాడని, దాంతో ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌పై దృష్టిసారించమన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో శార్దూల్ ఠాకుర్ సత్తా చాటడంతో అతనికి అవకాశం దక్కిందన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ అరుణ్.. ఇంగ్లండ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా..

హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా..

'హార్దిక్ పాండ్యా​కు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్​ చేయలేకపోతున్నాడు. 2018లో అతను చివరిసారిగా ఇంగ్లండ్​పై ఆడిన టెస్టు క్రికెట్​లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతనిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతనికి ప్రత్యామ్నయంగా ఆల్​రౌండర్లను సెలక్టర్లు గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం.

శార్దూల్ సత్తా చాటడంతో..

శార్దూల్ సత్తా చాటడంతో..

శార్దూల్​ విషయానికొస్తే అతడు మంచి ఆల్​రౌండర్​ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్​ ఆల్​రౌండర్​గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు. జట్టుకు కూడా ఫాస్ట్​ బౌలింగ్ ఆల్​రౌండర్​ ఎంతో అవసరం. కాబట్టి అతడిని ఆ విధంగా తీర్చుదిద్దుతాం. ఇంగ్లండ్​ పర్యటనలో తన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని భావిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల వర్క్‌లోడ్ తగ్గించడం చాలా ముఖ్యం.

రొటేషన్ విధానం ద్వారా

రొటేషన్ విధానం ద్వారా

కఠిన బయో‌బబుల్స్ నేపథ్యంలో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గించి ఫ్రెష్‌గా ఉండేలా చేయాలి. భారత జట్టులో ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో మొత్తం ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ముగ్గురు లేదా నలుగురికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. కాబట్టి రొటేషన్​ విధానం ద్వారా ఆడిస్తాం. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.'అని భరత్ అరుణ్ వెల్లడించాడు. జూన్‌ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Wednesday, May 12, 2021, 18:18 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X