న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటే కాదు.. అన్ని క్రీడల సారథుల్లో విరాట్ కోహ్లీ బెస్ట్.. విమర్శకులపై టీమిండియా బౌలింగ్ కోచ్ ఫైర్!

India bowling coach Bharat Arun responds to Virat Kohlis critics
Tiger Pataudi Captaincy: Should Rahane captain in Tests while Kohli and Rohit lead in limited-overs?

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలన్న విమర్శకులపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీని విమర్శించే ముందు కెప్టెన్‌గా అతను సాధించిన ఘనతలను గుర్తు తెచ్చుకోవాలని సూచించాడు. అన్ని క్రీడల అత్యుత్తమ సారథుల్లో విరాట్ కోహ్లీ రెండోవాడని తెలిపాడు. ఇక పెటర్నిటీ లీవ్‌తో ఆస్ట్రేలియా పర్యటన నుంచి విరాట్ తప్పుకోగా.. తాత్కలిక సారథిగా అజింక్యా రహానే జట్టును అద్భుతంగా నడిపించి చారిత్రాత్మక విజయాన్నందించాడు.

ఈ నేపథ్యంలో కొందరు మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని రహానే, రోహిత్ శర్మలకు అవకాశాలివ్వాలని సూచించారు. ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన భరత్ అరుణ్.. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాలను మరిచి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డాడు.

70 శాతం విజయాలు..

70 శాతం విజయాలు..

'ముందుగా ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా అద్భుత పనితీరు కనబర్చిన అజింక్యా రహానే‌కు అభినందనలు. కానీ విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా రాసేవారికి నేను చెప్పేది ఒకటే. మొత్తం 20 సిరీస్‌లకు విరాట్ కెప్టెన్‌గా ఉండగా.. అందులో భారత్ 14 సిరీస్‌లు నెగ్గింది. అతని సారథ్యంలోనే 70 శాతం విజయాలు దక్కాయి.అన్ని రకాల క్రీడల్లో‌ని కెప్టెన్లను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ రికార్డు అత్యుత్తమంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ రగ్బీ టీమ్ 80 శాతం విజయాలు అందుకోగా.. ఆ తర్వాత కోహ్లీనే 70 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

విరాట్ ఏం తక్కువ చేశాడు?

విరాట్ ఏం తక్కువ చేశాడు?

విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా రాసేవారంతా అతను సాధించిన ఈ విజయాలను మరిచిపోయారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టుకు ఏం తక్కువ చేశాడు? ఫిట్‌నెస్ కల్చర్‌ను జట్టులోకి తీసుకొచ్చింది అతనే. ఫాస్ట్ బౌలర్లు, ఫీల్డర్లు అందరూ విరాట్ సారథ్యంలోని ఎదిగారు. రహానే జట్టును అద్భుతంగా నడిపించాడు. కాదనడం లేదు. విరాట్ కోహ్లీ ఉన్నా వైస్ కెప్టెన్‌గా రహానే అదే చేసేవాడు. విలువైన సలహాలను తన కెప్టెన్‌కు ఇచ్చేవాడు. సలహాలు, సూచనలు స్వీకరించే విషయంలో కోహ్లీ చాలా ఓపెన్‌గా ఉంటాడు.

ఈ ఇద్దరితోనే..

ఈ ఇద్దరితోనే..

భారత జట్టు నిర్భయంగా, దూకుడుగా ఆడుతుందంటే దానికి కారణం ఇద్దరే. ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే మరొకరు కోచ్ రవిశాస్త్రి. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను వారు పూర్తిగా మార్చారు. బాగా రాణించాలంటే ఏ జట్టుకైనా ఇలాంటి క్వాలిటీస్ అవసరం. అలా జట్టులో విరాట్, శాస్త్రి సమూల మార్పులు తీసుకొచ్చారు. 'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ లేకున్నా భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో భారత్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

Story first published: Monday, January 25, 2021, 14:11 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X