న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీపక్ హుడా హాఫ్ సెంచరీ: తొలి టీ20లో దుమ్ము దులిపిన దినేష్ కార్తీక్ టీమ్

India beat Derbyshire in the First T20I warm up match. Deepak Hooda scored 59

లండన్: టీమిండియా సీనియర్ల జట్టుకు ధీటుగా రాణిస్తోంది కుర్రాళ్ల జట్టు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టింది. డెర్బిషైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్ తరువాత టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో- ఈ ప్రాక్టీస్ మ్యాచ్ అవసరమైంది. లోకల టీమ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్ర క్రికెటర్లు దుమ్ము దులిపారు. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బిషైర్ జట్టు 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల 150 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. 28 పరుగులు చేసిన వేన్ మ్యాడ్సెన్ ఒక్కడే టాప్ స్కోరర్. కేప్టెన్ షాన్ మసూద్-8, లూయిస్ రీస్-1,లెస్ డు ప్లూయ్-9, హిల్టర్ కార్ట్‌రైట్-27, బ్రూక్ గెస్ట్-23, అలెక్స్ హగ్స్-24, మ్యాటీ మెక్‌కెర్నెన్-20, మార్క్ వాట్-3 పరుగులు చేశారు. టీమిండియాలో బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రాణించాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ 31 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వెంకటేష్ అయ్యర్ ఒక్కో వికెట్ కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయినప్పటికీ.. టాప్ ఆర్డర్ సత్తా చాటింది. మరో ఓపెనర్ సంజు శాంసన్ 30 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 38, దీపక్ హుడా 37 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 59 పరుగులు చేశారు.

సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీపక్ హుడా తన ఫామ్‌ను కొనసాగిస్తోన్నాడు. ఇదివరకు ఐర్లాండ్‌తో ముగిసిన రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారీ స్కోర్ సాధించాడు. తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రెండో టీ20లో సెంచరీ బాదాడు. 57 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఫామ్‌లో ఉండటం జట్టు అదనపు బలం.

Story first published: Saturday, July 2, 2022, 7:37 [IST]
Other articles published on Jul 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X