న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: 1000వ టీ20.. చరిత్రలో భారత్‌, బంగ్లా!!

India Vs Bangladesh 1st T20 : BCCI Exclusive Update At 6:30 PM On 1000 T20 Match
India and Bangladesh will play 1000th T20I international match in Delhi, makes history

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌, బంగ్లా జట్ల మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ పార్రంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే.. అంతర్జాతీయ టీ20లలో ఇది 1000వ టీ20 మ్యాచ్ కాబట్టి.

<strong>ఢిల్లీ స్టేడియంలో తీవ్రంగా దుమ్మూ, ధూళీ.. పరిశుభ్రానికి నీటి ట్యాంకర్లు(వీడియో)!!</strong>ఢిల్లీ స్టేడియంలో తీవ్రంగా దుమ్మూ, ధూళీ.. పరిశుభ్రానికి నీటి ట్యాంకర్లు(వీడియో)!!

 1000వ టీ20 మ్యాచ్:

1000వ టీ20 మ్యాచ్:

ఆదివారం భారత్‌, బంగ్లా జట్ల మధ్య జరిగే టీ20 1000వ టీ20 మ్యాచ్. దీంతో భారత్‌, బంగ్లా జట్లు చరిత్రలో నిలవనున్నాయి. ఇరు జట్లు ఈ చారిత్రక మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి 1000వ టీ20 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. అయితే గెలిచిన జట్టు ఓ గొప్ప విజయంతో చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే బంగ్లాపై ఆడిన ఎనిమిది టీ20ల్లో గెలుపొందిన భారత్ ఇందులోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాక్ రికార్డుపై భారత్ కన్ను:

పాక్ రికార్డుపై భారత్ కన్ను:

ఇప్పటివరకు భారత్‌, బంగ్లా జట్లు ఎనిమిది టీ20ల్లో తలపడగా.. అన్ని సార్లు భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. టీ20ల్లో పాకిస్థాన్‌ 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో ఉంది. బంగ్లాపై భారత్‌ ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే.. పాక్ రికార్డును భారత్ సమం చేస్తుంది.

కాలుష్యం అడ్డంకి?:

కాలుష్యం అడ్డంకి?:

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి. ఇక దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. తొలి టీ20 మ్యాచ్‌కు కాలుష్యం అడ్డంకిగా మారినా.. బీసీసీఐ మాత్రం ఆటను కొనసాగిస్తోంది. శనివారం దిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ దుమ్మూ, ధూళీని తొలగించడానికి అరుణ్‌ జైట్లీ స్టేడియాన్ని నీటి ట్యాంకర్లతో కడిగారు. పెద్ద పైప్‌ ద్వారా స్టేడియంలోని గేట్ల పరిసరాల్ని శుభ్రంగా కడిగేశారు.

యువ ఆటగాళ్లకు అవకాశం:

యువ ఆటగాళ్లకు అవకాశం:

ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ పార్రంభం కానుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్‌ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. రిషభ్‌ పంత్‌ను కూడా కొనసాగిస్తారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది.

కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:

కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:

మరోవైపు కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్‌కు రెడీ అవుతోంది. ఐసీసీ బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. తొలి టీ20లో బంగ్లా జట్టు ఎలా ఆడనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Story first published: Sunday, November 3, 2019, 15:48 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X