న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ టీ20: కృనాల్, సుందర్ సిక్సర్ల మోత.. బంగ్లా లక్ష్యం 149

India and Bangladesh: Shikar Dhawan, Krunal Pandya help India set 149 run target for Bangladesh

ఢిల్లీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ జులిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి.. బంగ్లా ముందు 149 పరుగుల లక్ష్యంను ఉంచింది. బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీశారు.

వైరల్ వీడియో: ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!!వైరల్ వీడియో: ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!!

టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే టీమిండియా వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు) అదే ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ చేరాడు. షఫీవుల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (41) రాణించాడు.

రోహిత్ అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ (15) నెమ్మదిగా ఆడుతూ పూర్తిగా నిరాశపరిచాడు. ధావన్ జతగా శ్రేయస్ అయ్యర్ (22) విరుచుకుపడడంతో భారత్ స్కోర్ వేగం పెరిగింది. అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ పెవిలియాసీన్ చేరాడు. రిషబ్ పంత్ (27) వేగంగా పరుగులు చేయలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న దూబే (1) కూడా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు.

ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ జులిపించారు. ఈ ఇద్దరు చివరి ఓవర్లో రెండు సిక్సులతో సహా మొత్తం 16 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ (7) తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. అయితే మహ్మద్ నైమ్, సౌమ్య సర్కార్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడుతున్నారు. నైమ్ (20), సర్కార్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. బంగ్లా విజయానికి ఇంకా 117 పరుగులు కావాలి.

Story first published: Sunday, November 3, 2019, 21:32 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X