న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్.. మ్యాచ్‌ ఫీజును విరాళంగా ఇచ్చిన సంజు శాంసన్‌!!

India A vs South Africa A: Sanju Samson donates Rs 1.5 lakh match fees to groundsmen

ఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ తన మ్యాచ్‌ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

వైరల్ వీడియో.. పాకిస్థాన్ జట్టులో కోహ్లీ, ధావన్!!వైరల్ వీడియో.. పాకిస్థాన్ జట్టులో కోహ్లీ, ధావన్!!

శాంసన్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌ జరిగిందంటే మైదాన సిబ్బందే కారణం. వారికి ధన్యవాదాలు. మైదానం తడిగా ఉండి ఉంటే అధికారులు మ్యాచ్‌ను రద్దు చేసేవారు. ఈ క్రెడిట్ అంటా వారికే చెందుతుంది. నా మ్యాచ్‌ ఫీజుని మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నా' అని అన్నాడు. దీంతో కేరళ క్రికెటర్ మైదానంలోని హృదయాలను గెలుచుకున్నాడు. శాంసన్ రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక చివరి వన్డేలోనూ భారత్-ఏ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజిక్కించుకుంది.

వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేను 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సంజూతో పాటు టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేసాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్, లిండ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా-ఏ 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. తొలి మూడు వన్డేలు నెగ్గి సిరీస్ సొంతం చేసుకున్న భారత్ నాలుగో మ్యాచ్ ఓడినా.. చివరి వన్డేలో గెలుపొందింది.

Story first published: Sunday, September 8, 2019, 15:16 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X