న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND-W vs WI-W: శతక్కొట్టిన హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన.. విండీస్ ముందు కొండంత లక్ష్యం!

IND-W vs WI-W: Smriti Mandhana and Harmanpreet Kaur big centuries to help India set to 318 target

హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) సూపర్ సెంచరీలతో చెలరేగారు. దాంతో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 318 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును స్మ‌తి మంధాన, హర్మన్ ప్రీత్ ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించారు.

దాంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అనిసా మొహమూద్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూస్, షెకెరా, డియాండ్రా, అలెన్ తలో వికెట్ పడగొట్టారు.

ఆరంభం అదుర్స్..

ఆరంభం అదుర్స్..

ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(21 బంతుల్లో 6 ఫోర్లతో 31) మంచి శుభారంభాన్ని అందించారు. స్మృతి నిదానంగా ఆడినా.. యస్తికా తనదైన శైలిలో బౌండరీలు బాదింది. అయితే క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని సెల్మన్ విడదీసింది. రిటర్న్ క్యాచ్‌గా యస్తికాను పెవిలియన్ చేర్చింది.

దాంతో తొలి వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మిథాలీ రాజ్(5), దీప్తి శర్మ(15) తీవ్రంగా నిరాశపరిచారు. మాథ్యూస్ బౌలింగ్‌లో మిథాలీ క్యాచ్ ఔటవ్వగా.. మొహమ్మద్ బౌలింగ్ దీప్తి శర్మ కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరింది.

 స్మృతి, హర్మన్ సూపర్ సూపరో..

స్మృతి, హర్మన్ సూపర్ సూపరో..

దాంతో గత మ్యాచ్ మాదిరే భారత్ తడబడుతుందా? అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్‌కౌర్‌తో స్మృతి చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత జోరు కనబర్చింది.

ఈ క్రమంలో 66 బంతుల్లో మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత 61 బంతుల్లో హర్మన్ సైతం అర్థ శతకం సాధించింది.హాఫ్ సెంచరీల అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. స్మృతి రెండు భారీ సిక్స్‌లు కొట్టగా.. హర్మన్ సైతం పోటీపడి బాదింది.

ICC Womens World Cup 2022: IND VS PAK భారత్ శుభారంభం Pak చిత్తు | Oneindia Telugu
ఇద్దరూ సెంచరీలు..

ఇద్దరూ సెంచరీలు..

వేగంగా ఆడిన స్మృతి 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. 42 బంతుల్లోనే రెండో హాఫ్ సెంచరీ చేసుకోవడం విశేషం. సెంచరీ అనంతరం మరింత ధాటిగా ఆడిన స్మృతి.. భారీ షాట్ ఆడే క్రమంలో కాన్నెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 184 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే అలెన్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి హర్మన్ ప్రీత్ సైతం సెంచరీ పూర్తి చేసుకుంది.

ఆ మరుసటి బంతికే రిచా ఘోష్(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. పుజా వస్త్రాకర్ వరుస బౌండరీలతో చెలరేగి భారత్ స్కోర్‌ను 300 ధాటించింది. వేగంగా ఆడే క్రమంలోనే పూజా వస్త్రాకర్, హర్మన్ ప్రీత్ ఔటయ్యారు. దాంతో చివర్లో భారత్‌కు కావాల్సిన పరుగులు రాలేదు.

Story first published: Saturday, March 12, 2022, 10:22 [IST]
Other articles published on Mar 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X