న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో ఆఖరి టీ20: 6 పరుగుల దూరంలో కోహ్లీ, బద్దలయ్యే రికార్డులివే!

IND vs WI: Virat Kohli just six runs away from becoming first Indian to achieve this massive feat

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ విజేతను నిర్ణయించే టీ20 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో ఆఖరిదైన ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20ని టీమిండియా విజయం సాధించగా.. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంలో ఈ సిరిస్ మరింత రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఆఖరి టీ20లో విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే టీ20ల్లో సొంతగడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిన లంక పేసర్ ఇసురు ఉడాన (వీడియో)క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిన లంక పేసర్ ఇసురు ఉడాన (వీడియో)

మొత్తంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అవేంటో ఒక్కసారి చూద్దాం...

6 పరుగుల దూరంలో కోహ్లీ

6 పరుగుల దూరంలో కోహ్లీ

994: సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ పరుగులు సాధించాడు. మరో ఆరు పరుగులు సాధిస్తే స్వదేశంలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. స్వదేశంలో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలుస్తాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు.

మరో వికెట్ దూరంలో

మరో వికెట్ దూరంలో

52-1: టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ మరో వికెట్ దూరంలో నిలిచాడు. ఇప్పటివరకు 36 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీసిన చాహాల్.... రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

వెయ్యి పరుగుల దూరంలో

వెయ్యి పరుగుల దూరంలో

1000: తమ కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేందుకు కీరన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్‌లకు ఈ మ్యాచ్ ఓ గొప్ప అవకాశం. ఈ మ్యాచ్‌లో పొలార్డ్‌ మరో 10 పరుగులు, సిమ్మన్స్‌ మరో 17 పరుగులు అవసరం కానున్నాయి. ముంబైలో వీరిద్దరూ ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

సొంతగడ్డపై జరిగిన ఆరు టీ20ల్లో

సొంతగడ్డపై జరిగిన ఆరు టీ20ల్లో

1/5: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన ఆరు టీ20ల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇందులో కేవలం ఒక్కదానిలో మాత్రం ఇండియా నెగ్గి, మిగతా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతనెలలో బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ (6/7) అద్భుత రికార్డు నమోదు చేసిన టీ20లో విజయం సాధించింది.

కోహ్లీ యావరేజి 75.28

కోహ్లీ యావరేజి 75.28

75.28: ముంబై వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ యావరేజి. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 12 టీ20లాడిన విరాట్ కోహ్లీ 151.87 స్ట్రైక్‌రేట్‌తో 527 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

7-1: తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెండేళ్ల తర్వాత భారత్‌పై విండీస్ సాధించిన తొలి విజయమిదే. అంతకుముందు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది.

400 సిక్సుల క్లబ్‌లో రోహిత్ శర్మ

400 సిక్సుల క్లబ్‌లో రోహిత్ శర్మ

399: టీ20ల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన సిక్సర్ల సంఖ్య. మరో సిక్సర్ సాధిస్తే 400 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు. అంతేకాదు భారత్ తరుపున 400 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిది ఉన్నారు.

Story first published: Wednesday, December 11, 2019, 16:14 [IST]
Other articles published on Dec 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X