న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరంగేట్రం అంతలోనే!: 10 బంతులకే మైదానాన్ని వీడిన శార్ధూల్ ఠాకూర్

 IND Vs WI, 2nd Test: Thakurs Debut Turns Into Nightmare, Leaves Field After Bowling 10 Deliveries

హైదరాబాద్: టీమిండియా యువ పేసర్ శార్థుల్‌ ఠాకూర్‌‌ను దురదృష్టం వెంటాడింది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టు ద్వారా శార్ధూల్ ఠాకూర్
అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

1
44265

నొప్పితో మైదానంలోనే విలవిల్లాడిన శార్దూల్

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. తన అరంగేట్ర టెస్టులో మంచి ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్‌ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. దీంతో నొప్పితో మైదానంలోనే అతడు విలవిల్లాడు.

కోహ్లీ, ఫిజియో సూచన మేరకు మైదానాన్ని వీడిన శార్దూల్

కోహ్లీ, ఫిజియో సూచన మేరకు మైదానాన్ని వీడిన శార్దూల్

ఫిజియో మైదానంలో వచ్చి అతడికి సపర్యలు చేసినప్పటికీ గాయం తీవ్రత తగ్గలేదు. దీంతో కెప్టెన్‌ కోహ్లీ, ఫిజియో సూచన మేరకు శార్దూల్ మైదానం వీడాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు అయ్యో ఠాకుర్‌! అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో శార్థుల్‌ 3.4 బంతులే వేయగా మిగిలిన రెండు బంతులను అశ్విన్‌ వేశాడు.

లంచ్ విరామానికి వెస్టిండిస్ 86/3

లంచ్ విరామానికి వెస్టిండిస్ 86/3

ఇదిలా ఉంటే, రెండో టెస్టులో మొదటిరోజు భోజన విరామ సమయానికి వెస్టిండిస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా, భారత స్పిన్నర్లు అశ్విన్‌, కుల్దీప్‌లు ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చారు. ఓపెనర్లు బ్రాత్‌వెయిట్ 14, పావెల్ 22, షాయ్ హోప్ 36 పరుగులు చేసి ఔటయ్యారు.

86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్

86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్

దీంతో విండీస్‌ 86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్‌, హెట్‌మెయిర్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఉమేశ్‌ యాదవ్‌ హోప్‌(36) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 32 పరుగులు జోడించి కాస్త కుదురుకుంటున్నట్లు కనిపించినా ఆ తర్వాత మూడు వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, October 12, 2018, 13:18 [IST]
Other articles published on Oct 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X