న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs దక్షిణాఫ్రికా రెండో టెస్టు.. ఒంటిచేత్తో వీవీఎస్‌ లక్ష్మణ్ సూపర్ క్యాచ్ (వీడియో)!!

IND vs SA: VVS Laxman picks a super one handed catch in commentators cricket match

పుణె: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. డైవ్ చేసి మరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టి సహచరులతో శబాష్ అనిపించుకున్నాడు. అదేంటి లక్ష్మణ్‌ ఎప్పుడో రిటైర్ అయ్యాడు కదా!!.. మరి ఇప్పుడు క్యాచ్ పట్టడం ఏంటి అనుకుంటున్నారా?. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న లక్ష్మణ్‌.. తోటి కామెంటటేటర్లతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లోనే ఈ అద్భుతం చేసాడు. వీవీఎస్‌ లక్ష్మణ్, ఆకాశ్‌చోప్రా, జతిన్ సప్రూ, గ్రేమ్ స్మిత్, ఇర్ఫాన్ పఠాన్, నిఖిల్ చోప్రా మ్యాచ్ ఆడారు.

PKL 2019: నేడు ప్రొ కబడ్డీ సెమీఫైనల్స్.. షెడ్యూల్, టైమింగ్స్, జట్ల వివరాలు!!PKL 2019: నేడు ప్రొ కబడ్డీ సెమీఫైనల్స్.. షెడ్యూల్, టైమింగ్స్, జట్ల వివరాలు!!

లక్ష్మణ్ సూపర్ క్యాచ్:

లక్ష్మణ్ సూపర్ క్యాచ్:

పుణె వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం రెండో టెస్ట్ ముగిసిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆట ప్రారంభమవడానికి ముందు కామెంటేటర్‌లు అందరు మైదానంలో గల్లీ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ ఆకాశ్‌చోప్రా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో.. షార్ట్‌ లెగ్‌లో లక్ష్మణ్ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. నిఖిల్ చోప్రా బంతిని వేయగా.. ఆకాశ్‌చోప్రా కొట్టిన బంతిని లక్ష్మణ్ డైవ్‌ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే అది వన్‌బౌన్స్‌ క్యాచ్‌ కావడం విశేషం.

ఆశ్చర్యపోయిన ఆకాశ్‌చోప్రా:

లక్ష్మణ్ పట్టిన క్యాచ్‌కు సహచర కామెంటేటర్‌లు చప్పట్లు కొట్టి అభినందించారు. ఇక ఆకాశ్‌చోప్రా బ్యాట్ వదిలేసి ఆశ్చర్యపోయాడు. మ్యాచ్‌ అనంతరం ఈ వీడియోను లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నేను పట్టిన అత్యద్భుత క్యాచ్‌లలో ఇదొకటి. ఫుల్‌ సూట్‌లో ఉన్న సమయంలో ఈ మ్యాచ్‌ జరిగింది. తెల్ల దుస్తుల్లో ఉన్నప్పుడు కాదు' అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

రాంచీలో మూడో టెస్టు:

రాంచీలో మూడో టెస్టు:

పుణెలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) డబుల్ సెంచరీ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6) మెరుపు అర్ధ సెంచరీ చేశారు. అనంతరం ఉమేష్ యాదవ్, అశ్విన్, జడేజా చెలరేగడంతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్‌ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది.

గంగూలీకి కంగ్రాట్స్:

గంగూలీకి కంగ్రాట్స్:

బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్న గంగూలీకి కంగ్రాట్స్. మీ నేతృత్వంలో భారత క్రికెట్‌ మరింత వృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు. కొత్త పాత్రలో మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, October 16, 2019, 9:41 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X