న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: షమీ సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రోహిత్.. ఏంటో తెలుసా?!!

IND vs SA 2019,1st Test : Rohit Sharma Reveals The Secret Behind Mohammed Shami's Success
IND vs SA: Rohit Sharma Reveals The Secret Behind Mohammed Shami bowling Success

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో పేసర్ మొహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే షమీ అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్‌ ఏమిటో ఓపెనర్ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. బిర్యానీ తినడమే షమీ సక్సెస్ సీక్రెట్‌ అని రోహిత్ వెల్లడించాడు.

<strong>IND vs SA: కోహ్లీ ప్రశంసలు: రోహిత్ ఔట్‌స్టాండింగ్.. మయాంక్ బ్రిలియంట్!!</strong>IND vs SA: కోహ్లీ ప్రశంసలు: రోహిత్ ఔట్‌స్టాండింగ్.. మయాంక్ బ్రిలియంట్!!

షమీ సీక్రెట్‌ బిర్యానీ:

షమీ సీక్రెట్‌ బిర్యానీ:

రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... 'ఇటీవల షమీ బాగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్‌-2019లో కూడా వికెట్లతో చెలరేగాడు. చాలా నిలకడ ప్రదర్శిస్తున్నాడు. షమీ అదరగొట్టడం వెనుక ఓ సీక్రెట్‌ ఉంది. బిర్యానీ తిన్న తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. దాంతో అతడిలోని అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బిర్యానీ తినడమే షమీ అసలు సీక్రెట్‌' అని తెలిపాడు.

అంచనాల మేరకు ఆడటమే నా పని

అంచనాల మేరకు ఆడటమే నా పని

'జట్టు అంచనాల మేరకు ఆడటమే నా పని. ఏదో ఓ రోజు ఓపెనింగ్‌ చేయాల్సి వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారు. నెట్స్‌లోనూ నేను కొత్త బంతితోనే సాధన చేస్తా. అందుకే నా ఎంపిక ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎరుపు బంతి, తెలుపు బంతి అనేది కాకుండా.. ఆరంభంలో ఆచితూచి ఆడాలి. ఆఫ్‌ సైడ్‌ వెళ్లే బంతుల్ని వదిలేయాలి. దేహం మీదికి వచ్చేవాటిని ఎదుర్కోవాలి. బ్యాటింగ్‌ చేస్తున్న పరిస్థితులను బట్టి అంతా ఆధారపడి ఉంటుంది. ఆచితూచి ఆడుతూనే దూకుడు ప్రదర్శించడం నా పని' అని రోహిత్‌ అన్నాడు.

రికార్డులపై మాత్రం అవగాహన లేదు

రికార్డులపై మాత్రం అవగాహన లేదు

'రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యం పెంచాలనుకున్నాం. అందుకే షాట్లు ఆడాలని భావించా. ప్రస్తుతం బౌలర్లు తెలివిగా బంతులు వేస్తున్నారు. పరుగులు రావొచ్చు లేదా ఔటైపోవచ్చు. నేను మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడా. ధైర్యం ఫలితాలను ఇస్తుందని నా నమ్మకం. ఈ టెస్టులో ఎన్నో చోటు చేసుకున్నాయి. రికార్డులపై మాత్రం అవగాహన లేదు. ఆటను ఆస్వాదిస్తూ జట్టును పటిష్ఠ స్థితిలో పెట్టడంపైనే దృష్టి పెట్టా. జట్టును గెలిపించాలని కోరుకున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.

బౌన్స్‌ తక్కువగా ఉంటే బ్యాట్స్‌మెన్‌కు కష్టం

బౌన్స్‌ తక్కువగా ఉంటే బ్యాట్స్‌మెన్‌కు కష్టం

'పిచ్‌ మందకొడిగా ఉండి బౌన్స్‌ తక్కువగా ఉంటే బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. జట్టులో వికెట్లు తీసే మంచి బౌలర్లు ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన బౌన్స్‌, రివర్స్‌ స్వింగ్‌ మేలు చేసింది. కట్టుదిట్టంగా బంతులు వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అసౌకర్యానికి గురిచేశాం. వికెట్లను త్వరగా పడగొట్టడం కలిసొచ్చింది. ఈ విజయం అందరిది. వచ్చే టెస్టులలో కూడా రాణించడానికి ప్రయత్నిస్తా' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 7, 2019, 11:00 [IST]
Other articles published on Oct 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X