న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA:'వినయ్‌ కుమార్‌ ప్రేరణ ఇవ్వకుంటే.. మయాంక్‌ అగర్వాల్‌ను చూసేవాళ్ళం కాదు'

IND vs SA: Robin Uthappa reveals how Vinay Kumar words spurred out of form Mayank Agarwal

కోల్‌కతా: పరుగులు చేయలేక తంటాలు పడుతున్న మయాంక్‌ అగర్వాల్‌కు కర్ణాటక మాజీ కెప్టెన్ వినయ్‌ కుమార్‌ ప్రేరణ ఇవ్వకుంటే.. అతన్ని ఇప్పుడు ఇలా మనం చూసేవాళ్ళం కాదు అని టీమిండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ (358 బంతుల్లో 200, 23 ఫోర్లు, 6 సిక్సులు) డబుల్ సెంచరీ చేసాడు. మరోపెనర్ రోహిత్‌ శర్మ (176)తో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యంను నెలకొల్పి రికార్డులోకి ఎక్కాడు. రోహిత్ పెవిలియన్ చేరినా.. మిగతా ఆటగాళ్లతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

వినయ్‌ కుమార్‌ ప్రేరణ

వినయ్‌ కుమార్‌ ప్రేరణ

రాబిన్‌ ఉతప్ప కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... 'మయాంక్ ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. రంజీ మ్యాచ్‌ నుంచి తప్పించాలని అందరం అనుకున్నాం. కానీ వినయ్‌ కుమార్‌ మాత్రం వద్దు అని చెప్పాడు. వినయ్‌ తన మాటలతో మయాంక్‌కు ప్రేరణనిచ్చాడు. ఆ ప్రోత్సాహంతో అతడు త్రిశతకం చేసాడు. అది ఇప్పటికి నాకు గుర్తుంది. ఆ రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కర్ణాటక ఇన్నింగ్స్‌ 136 పరుగుల తేడాతో తెలిచింది. మయాంక్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తే ఇంకా మెరుగవుతాడు. ఈ డబుల్ అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది' అని పేర్కొన్నాడు.

అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్

అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్

ఓపెనర్‌గా తొలి సెంచరీ సాధించిన రోహిత్‌ను కూడా ఉతప్ప అభినందించాడు. 'పరిమిత ఓవర్లలో రోహిత్‌ స్వదేశీ, విదేశాల్లో రాణించాడు. తెలుపు బంతి క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ ఒకడు. కెరీర్‌లో తన బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన ఉంది. ఏం చేస్తే పరుగులు వస్తాయో అతడికి తెలుసు. సరైన సమయంలో రోహిత్‌కు ఓపెనింగ్‌ అవకాశం వచ్చింది. అతడు విజయవంతం కావడంలో నాకెలాంటి ఆశ్చర్యం లేదు. సెహ్వాగ్‌తో అతడికి పోలిక లేదు. వీరిద్దరి ఆటతీరు, దూకుడులో ఎంతో తేడా ఉంది' అని ఉతప్ప అన్నాడు.

ఓ మంచి సెంచరీ

ఓ మంచి సెంచరీ

ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌ డబుల్ సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. 'మయాంక్ అగర్వాల్ ఓ మంచి సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుండి చాలా కష్టపడ్డాడు. రోహిత్, మయాంక్ భాగస్వామ్యం చూడటానికి చాలా ఆనందంగా ఉంది' అని ట్వీటాడు. ఇక చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా ద్విశతకం చేసిన అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Story first published: Friday, October 4, 2019, 9:50 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X