న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌ టీమిండియాలో కీలక సభ్యుడు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు: సచిన్

IND vs SA: Ravichandran Ashwin key player Of Indian Team Says Sachin Tendulkar


ముంబై:
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియాలో కీలక సభ్యుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని భారత క్రికెట్ దేవుడు, దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్ పేర్కొన్నారు. యువ మణికట్టు స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావడంతో గత కొంత కాలంగా అశ్విన్‌ పరిమిత ఓవర్ల ఆటకు దూరంగా ఉంటున్నాడు. ప్రపంచకప్-2019 కూడా ఆడలేదు. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ యువతకు అవకాశం ఇవ్వడంతో అశ్విన్‌కు చోటు దక్కడం కష్టంగా మారింది.

IND vs SA: విశాఖ టెస్టుకు వర్షం అంతరాయం.. ముగిసిన తొలిరోజు ఆటIND vs SA: విశాఖ టెస్టుకు వర్షం అంతరాయం.. ముగిసిన తొలిరోజు ఆట

ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అశ్విన్‌ మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడలేదు. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. కూర్పులో భాగంగా తుది జట్టులో చోటు దక్కలేదు. అశ్విన్‌ను పక్కనపెట్టినా.. కోహ్లీసేన ఆ పర్యటనను విజయవంతంగా ముగించిన కారణంగా పెద్దగా విమర్శలు రాలేదు. అయితే మాజీలు మాత్రం అశ్విన్‌ను ఆడించాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు.

ఇక విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... ''అశ్విన్‌ టాప్ బౌలర్‌. కేవలం బంతితోనే కాదు కీలకమైన పరుగులు చేసి జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు. భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. అశ్విన్‌ సుదీర్ఘకాలంగా జట్టుతో ఉన్నాడు. తన ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నా వరకైతే అతడు భారత జట్టులో అంతర్భాగం' అని అన్నారు.

గతంలో నిలకడగా రాణించిన అశ్విన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయాల బారిన పడుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో పూర్తి ఫిట్‌నెస్‌తో లేనప్పటికీ అతడిని ఆడించారు. గత సీజన్-12లో ఐపీఎల్‌ ప్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు నాయకత్వం వహించి మంచి మార్కులే కొట్టేసాడు. అశ్విన్‌ 65 టెస్ట్ మ్యాచ్‌లలో 342 వికెట్లు తీసాడు. 7/59 బెస్ట్ బౌలింగ్ గణాంకాలు. ఐదు వికెట్లు 26 సార్లు తీసాడు.

Story first published: Wednesday, October 2, 2019, 17:21 [IST]
Other articles published on Oct 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X