న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

160 పాయింట్లతో భారత్ అగ్రస్థానం.. ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లీసేన!!

IND vs SA: India Retain Top Spot in World Test Championship After Win

దుబాయ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్‌ మహ్మద్‌ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు అదరకొట్టారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్ అగర్వాల్ సెంచరీల మోత మోగించగా.. బౌలర్లు షమీ, జడేజా, అశ్విన్ చెలరేగారు.

బుమ్రాకు జాలి, దయ ఉండవు.. సహచరులను కూడా వదిలిపెట్టడు!!బుమ్రాకు జాలి, దయ ఉండవు.. సహచరులను కూడా వదిలిపెట్టడు!!

ఈ టెస్ట్ విజయంతో భారత్‌ ఖాతాలో 40 పాయింట్లు చేరాయి. ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన ఎవరికీ అందనంత ఎత్తులోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 120 పాయింట్లు ఉండగా.. ఇప్పుడు 40 పాయింట్లు చేరడంతో 160 పాయింట్లతో కోహ్లీసేన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇదే తొలి సిరీస్‌. ఈ ఓటమితో సున్నా పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

ఇటీవలే తలపడ్డ న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు 60 పాయింట్లతో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. యాషెష్-209లో పాల్గొన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు 56 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ సిరీస్‌లో రెండు ఓటములను ఎదుర్కొన్న విండీస్‌ ఖాతాలో పాయింట్లేమీ లేకపోవడంతో 6వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఇంకా ఛాంపియన్‌షిప్‌లో పోటీపడలేదు. కాబట్టి ఆ జట్లు 8, 9 స్థానాల్లో ఉన్నాయి.

ఐసీసీ యాషెష్ సిరీస్‌కు ముందు టెస్టు ఛాంపియన్‌షిప్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు ఉంటాయి. మ్యాచ్‌ల సంఖ్యను బట్టి ఈ పాయింట్లు విభజిస్తారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్‌ జట్ల మధ్య మూడు టెస్టులు ఉన్నాయి కాబట్టి.. ఒక్కో టెస్టుకు 40 పాయింట్లు ఉంటాయి. ఒక సిరీస్‌లో రెండు టెస్టులు ఉంటే.. ఒక్కో టెస్టుకు 60 పాయింట్లు కేటాయిస్తారు. ఇక 5 మ్యాచులుంటే ఒక్కో మ్యాచ్‌కు 24 పాయింట్లు వస్తాయి. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే సగం పాయింట్లు ఇరు జట్లకు వస్తాయి.

Story first published: Sunday, October 6, 2019, 19:31 [IST]
Other articles published on Oct 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X