న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rishabh Pant: ఫెయిల్యూర్స్‌పై రియాక్షన్ ఇదీ: విమర్శకుల నోళ్లకూ

IND vs SA 2022 5th T20: I am always thinking 100% as a player and captain, says Pant

బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాగుతున్న అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్.. కేప్టెన్ రిషభ్ పంత్‌ను విమర్శలకు గురి చేసింది. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగింది. ఈ సిరీస్ మొత్తానికీ బ్యాటర్‌గా అతను విఫలం అయ్యాడు. వర్షం వల్ల రద్దయిన బెంగళూరు మ్యాచ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే రిషభ్ పంత్ చేసిన పరుగులు.. 58. కేప్టెన్‌గా చివరి రెండింట్లో భారత జట్టును విజయం వైపు నడిపించాడనే పేరు తెచ్చుకున్నాడే గానీ.. బ్యాటర్‌గా సత్తా చాటలేకపోయాడు.

భారీగా విమర్శలు..

భారీగా విమర్శలు..

అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధించారు. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్, ఇర్ఫాన్ పఠాన్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. వంటి పలువురు ప్లేయర్లు రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ను తప్పుపట్టారు. చేసిన తప్పుల నుంచి రిషభ్ పంత్ గుణపాఠాలను నేర్చుకోలేకపోతున్నాడంటూ మండిపడ్డారు. షాట్ల ఎంపికలో తప్పులు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని వ్యాఖ్యానించారు. అనవసరపు షాట్లతో వికెట్‌ను పారేసుకున్నాడని, అది అతని కేరీర్‌కు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

స్పందించిన పంత్..

స్పందించిన పంత్..

ఈ విమర్శలన్నింటినీపైనా రిషభ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ రద్దయిన అనంతరం మాట్లాడాడు. ఓ ప్లేయర్‌గా, కేప్టెన్‌గా తాను వందశాతం చిత్తశుద్ధితో ఆడటానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. బ్యాటర్‌గా భారీ ఇన్నింగ్ ఆడకపోవడం తనను కూడా కొంత ఫ్రస్ట్రేషన్‌కు గురి చేసిందని, దీని నుంచి బయటపడటంపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు. తన కేప్టెన్సీలో కొన్ని పాజిటివ్స్ కూడా లేకపోలేదని రిషభ్ పంత్ గుర్తు చేశాడు. 2-0తో వెనుకంజలో ఉన్న సమయంలో పుంజుకొన్నామని, సిరీస్‌ను సమం చేశామని చెప్పాడు.

పొరపాట్లు సహజమే..

పొరపాట్లు సహజమే..

మ్యాచ్‌లో పొరపాట్లు చోటు చేసుకోవడం సహజమేనని, దాన్ని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని రిషభ్ పంత్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లను గెలవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోన్నామని, అవి ఫలించాయని చెప్పాడు. కొత్త మార్గాల్లో వెళ్తోన్న సమయంలో కొన్ని అడ్డంకులు సహజమేనని, వాటిని ఎలా అధిగమించామన్న దానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు. తన బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకుంటానని భరోసా ఇచ్చాడు.

58 పరుగులతో..

58 పరుగులతో..

ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ ఇప్పటివరకు 57 పరుగులు చేశాడు. యావరేజ్ 14.25. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 105.55తో బ్యాటింగ్ సాగుతోంది. తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 29, రెండో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో ఆరు, మూడో మ్యాచ్‌లో ఏడు బంతుల్లో అయిదు, నాలుగో మ్యాచ్‌లో 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు రిషభ్ పంత్. రద్దయిన బెంగళూరు మ్యాచ్‌లో ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.

Story first published: Monday, June 20, 2022, 10:30 [IST]
Other articles published on Jun 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X