న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ruturaj Gaikwad: గ్రౌండ్ స్టాఫ్‌ పట్ల దురుసు ప్రవర్తన: ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్

India opener Ruturaj Gaikwad received troll on on social media platform Twitter after a video of the cricketer refusing to pose for a selfie with a ground staff.

బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన బెంగళూరులో ఎడతెరిపినివ్వకుండా కురిసిన వర్షం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తానికీ మూడున్నర ఓవర్లే పడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో రెండోసారి మొదలైన వర్షం.. ఇక తెరిపినివ్వలేదు. దీనితో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

గ్రౌండ్ స్టాఫ్ పట్ల..

వర్షం పడినప్పుడు లభించిన విరామ సమయంలో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. గ్రౌండ్ స్టాఫ్ పట్ల దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ప్రవర్తన పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతణ్ని ఏకిపడేస్తోన్నారు. మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ కంటే ఎక్కువగా గ్రౌండ్ స్టాఫ్ కష్టపడ్డారని గుర్తు చేస్తోన్నారు.

శ్రమించిన గ్రౌండ్ స్టాఫ్..

వర్షపు నీటిని తొలగించడానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పెద్ద ఎత్తున గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దించింది. పిచ్‌ను మూసివుంచినప్పటికీ.. అవుట్ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిమయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఎప్పటికప్పుడు వర్షపునీటిని ఎత్తివేస్తూ కనిపించారు గ్రౌండ్ స్టాఫ్. వర్షం కొద్దిగా గ్యాప్ ఇచ్చినా మ్యాచ్‌ను కొనసాగించేలా అవుట్ ఫీల్డ్‌ను తయారు చేయడానికి గ్రౌండ్ స్టాఫ్ శ్రమించారు. ఆ సమయంలో టీమిండియా ప్లేయర్లు తమ డగౌట్‌లో గడిపారు.

నెట్టేసిన గైక్వాడ్..

హెల్మెట్, చేతులకు గ్లోవ్స్ ధరించిన రుతురాజ్ గైక్వాడ్ డగౌట్‌లో కూర్చుని కనిపించాడు. అక్కడే ఉన్న గ్రౌండ్ స్టాఫ్ ఒకరు.. డగౌట్‌లో ఉన్న గైక్వాడ్ పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. అతణ్ని నెట్టేశాడు. వెళ్లిపొమ్మంటూ చేతులు ఊపాడు. ఇది కెమెరాల్లో రికార్డయింది. చినుకులు పడకుండా కెమెరాలను తేలికపాటి ప్లాస్టిక్ కవర్‌తో మూసివుంచడం వల్ల ఇది స్పష్టంగా కనిపించట్లేదు. మ్యాచ్ సజావుగా సాగడానికి వీలుగా కష్టపడిన గ్రౌండ్ స్టాఫ్ పట్ల గైక్వాడ్ అలా అమర్యాదగా ప్రవర్తించడం అభిమానులకు నచ్చలేదు.

అహంకారమా?

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అతని మీద మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. గతంలో రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాటర్ సైతం గ్రౌండ్ స్టాఫ్ పట్ల ఎంతో మర్యాదపూరకంగా వ్యవహరించే వారని, వారితో సెల్ఫీ తీసుకోవడానికి సమయాన్ని కేటాయించే వారని గుర్తు చేస్తోన్నారు. గైక్వాడ్‌‌కు అంత అహంకారం పనికిరాదంటూ హితబోధ చేస్తోన్నారు.

Story first published: Monday, June 20, 2022, 8:29 [IST]
Other articles published on Jun 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X