హైదరాబాద్: బంగ్లాదేశ్ తాత్కలిక కెప్టెన్ లిటన్ దాస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో లిటన్ దాస్ మైమరిపించే ఫీల్డింగ్‌తో విరాట్ కోహ్లీ(9) వికెట్‌ను సాధించాడు. లిటన్ దాస్ మాస్టర్ క్లాస్ ఫీల్డింగ్‌కు విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం లిటన్ దాస్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే.. పవర్ ప్లే అనంతరం షకీబ్ అల్ హసన్ వేసిన 11వ ఓవర్‌లో రోహిత్ శర్మ(27), విరాట్ కోహ్లీ(9) బంతి వ్యవధిలోనే ఔటయ్యారు. ముందుగా షకీబ్ వేసిన అద్భుత బంతికి రోహీత్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. తర్వాత లిటన్ దాస్ కళ్లు చెదిరే క్యాచ్‌కు విరాట్ పెవిలియన్ బాట పట్టాడు. షకీబ్ వేసిన మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా భావించి రోహిత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు.
Virat Kohli Out in Shakib-Al-Hasan #ViratKohli𓃵 #KingKohli #PAKvENG #naseemshah #BANvIND #INDvsBAN pic.twitter.com/3rHYBYPnBY
— Salman Meo (@SalmanK62069884) December 4, 2022
Don't disappoint in the 2nd ODI🥺#BANvIND #ViratKohli𓃵 pic.twitter.com/DZamYcaVJK
— Shreya❣️ (@Here4VK18) December 4, 2022
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(7) కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. హసన్ మీర్జా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హోస్సెన్ దెబ్బకొట్టాడు. అయ్యర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సుందర్‌తో రాహుల్ పోరాడుతున్నాడు.