న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా... 40 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డు బద్దలు!

IND vs ENG: Jasprit Bumrah Breaks Kapil Devs 40 years old Record

బర్మింగ్‌హామ్: టీమిండియా తాత్కలిక కెప్టెన్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో అద్భుత బౌలింగ్‌తో 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో సెట్ అయిన ఓపెనర్ జాక్ క్రాలీ, ఓలీ పోప్‌లను పెవిలియన్ చేర్చిన బుమ్రా ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టిన బుమ్రా తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలోనే కపిల్ దేవ్(22), భువనేశ్వర్ కుమార్(19)రికార్డును అధిగమించాడు. 1981-82 ఇంగ్లండ్‌ పర్యటనలో భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌ 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా సిరీస్‌లో కపిల్‌ దేవ్‌ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఇక 378 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ(46), అలెక్స్ లీస్(56) మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే బుమ్రా తన వరుస ఓవర్‌లో జాక్ క్రాలీ, ఓలిపోప్‌ను ఔట్ చేయగా.. రవీంద్ర జడేజా సూపర్ ఫీల్డింగ్‌తో అలెక్స్ లీస్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండు పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో(24 బ్యాటింగ్), జో రూట్ (45 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు. దాంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 200 పరుగులకే అవసరమవ్వగా.. భారత్‌కు ఏడు వికెట్లు కావాలి.

125/3 ఓవర్ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. బెన్ స్టోక్స్(4/33) అద్భుత బౌలింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. ఓవర్ నైట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(66)భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవ్వగా.. రిషభ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఇతర బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(27), మహమ్మద్ షమీ(13), జస్‌ప్రీత్ బుమ్రా(7) చేతులెత్తేయడంతో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌‌కు తోడుగా స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్ రెండేసి వికెట్లు తీయగా.. అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

Story first published: Monday, July 4, 2022, 22:25 [IST]
Other articles published on Jul 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X