న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Moeen Ali : అప్పటి ఇంగ్లాండ్ వేరు.. ఇప్పటి ఇంగ్లాండ్ వేరు.. తట్టుకోవాలంటే కోహ్లీ కెప్టెన్ కావాలి

Ind vs Eng 5th Test : Moeen Ali Suggests Kohli Need To Lead The Indian Side if Rohit not Available

పటౌడీ ట్రోఫీలో భాగంగా రీషెడ్యూల్ చేసిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. జులై 1న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఇటీవల కరోనా బారిన పడ్డ రోహిత్ శర్మ కోలుకున్నాడా లేదా అనే విషయంలో ఎలాంటి అప్డేట్లు లేవు. ఇప్పటికే గాయం కారణంగా ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేడు. ఇంగ్లాండ్‌కు, భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకమైనందున రోహిత్ అందుబాటులో లేకుంటే భారత మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌కు కరోనా రావడంతో..

రోహిత్‌కు కరోనా రావడంతో..

కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం కరోనా బారిన పడ్డాడనే వార్త తెలిసింది. రాపిడ్ యాంటీజెన్ టెస్టులో రోహిత్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో ఇండియాకు ఈ టెస్ట్ ముందు పెద్ద దెబ్బ పడింది. రోహిత్ టెస్ట్ టైంకి అందుబాటులో రాకపోతే జట్టు కెప్టెన్సీ ఎవరు చేస్తారనే విషయమై ఆందోళన నెలకొంది. ఇటీవల లీసెస్టర్ షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్లో రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ రాలేదు. దీంతో అతనికి వైరస్ సోకిందనే వార్తలు రాగా ఆ వార్తలను బీసీసీఐ తర్వాత కన్ఫామ్ చేసింది. ఇక ప్రస్తుతం రోహిత్ ఐదు రోజుల ఐసోలేషన్లో ఉన్నాడు.

అప్పట్లో విరాట్ ఉన్నాడు కాబట్టి..

అప్పట్లో విరాట్ ఉన్నాడు కాబట్టి..

'గతేడాది జరిగిన ఈ సిరీస్‌లో ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో చివరిదైనా అయిదో టెస్ట్‌కు కూడా అతన్నే కెప్టెన్ చేయాలని నేను ప్రతిపాదిస్తున్నా. అయితే అతను కెప్టెన్సీని తీసుకోవాలనుకుంటున్నాడా లేదా అనేది స్పష్టంగా అతని ఇష్టం. అతను ప్రస్తుతం రిలాక్స్‌గా, సంతోషంగా ఉండుంటాడు. అతను ఇప్పటికే తను కేవలం ప్లేయర్ అనే ఫీలింగ్‌తో కూల్‌గా ఫీలవుతుంటాడు. ఇప్పుడు అతన్ని కెప్టెన్ అంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ఏదేమైనా కెప్టెన్సీ విషయంలో అతను అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇది భారతదేశానికి చాలా కీలకమైన సిరీస్ కూడా' అని మొయిన్ అలీ పేర్కొన్నారు.

 ఇంగ్లాండ్ ఆట విధానంలో చాలా ఛేంజ్

ఇంగ్లాండ్ ఆట విధానంలో చాలా ఛేంజ్

స్వదేశంలో ఇటీవల ముగిసిన సిరీస్‌లో ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్‌ను 3-0తేడాతో ఓడించిన బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో కన్పిస్తుంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులో పలు మార్పులు జరిగాయి. అలాగే వారి గేమ్ విధానంలో కూడా ఛేంజ్ కన్పించింది. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్లో సక్సెస్ అయ్యాక వారి ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే.. రాబోయే టెస్టులో ఇంగ్లాండ్‌దే పైచేయి కావొచ్చనిపిస్తుందని మొయిన్ పేర్కొన్నాడు.

అప్పుడే ముగిసి ఉంటే వేరేలా ఉండేది

అప్పుడే ముగిసి ఉంటే వేరేలా ఉండేది

మొయిన్ మాట్లాడుతూ.. 'గతేడాదే ఈ సిరీస్‌ ముగిసి ఉండుంటే.. భారత్ 3-1తో సిరీస్ గెలిచి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంగ్లాండ్ చాలా మంచి క్రికెట్ ఆడుతోంది. ఇంగ్లాండ్‌తో పోలిస్తే భారత్ అంత పక్కాగా, పటిష్ఠంగా లేనట్లు తోస్తుంది. ఇంగ్లాండ్ గత కొన్ని మ్యాచ్‌లలో ఆడినట్టే ఆడితే గనుక ఈ టెస్ట్‌లో ఇంగ్లాండ్ జట్టే ఫేవరెట్ అవుతుంది' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య ఈ టెస్ట్ సిరీస్‌లో 2-1తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. భారత్ సిరీస్ గెలవడానికి గేమ్‌ను డ్రా లేదా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ తమ జోరును కొనసాగించి సిరీస్‌ను సమం చేసేందుకు చివరి టెస్టులో విజయం సాధించాలని చూస్తుంది.

Story first published: Wednesday, June 29, 2022, 14:34 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X