న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravindra Jadeja: సర్ అని ఊరికే అన్నారా: చెన్నై సూపర్ కింగ్స్ కామెంట్స్

IND vs ENG 5th test day 2: Twitter lauds Ravindra Jadeja’s maiden overseas ton

లండన్: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు 416 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి సెషన్‌లోనే టీమిండియా ఇన్నింగ్ ముగిసింది. చివరి మూడు వికెట్లు త్వరగానే పడ్డాయి. తొలి ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్.. ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. అలెక్స్ లీస్‌ను జస్‌ప్రీత్ బుమ్రా బలి తీసుకున్నడు. క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే వర్షం పడటంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్‌కు బ్రేక్ పడింది.

భారత్ ఇన్నింగ్‌లో రెండో రోజు కూడా సెంచరీ నమోదైంది. రవీంద్ర జడేజా ఈ ఘనత సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రవీంద్ర జడేజా తొలి గంటలోనే సెంచరీ కొట్టాడు. టెస్ట్ మ్యాచ్‌లల్లో అతనికి ఇది మూడో సెంచరీ. ఈ ఏడాదిలో అతను చేసిన రెండో సెంచరీ. మాథ్యూ పాట్ వేసిన 79వ ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలకు తరలించి మరీ.. రవీంద్ర జడేజా వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. తనదైన స్టైల్‌లో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.

IND vs ENG 5th test day 2: అదేం కొట్టుడురా భయ్: ఒక్క ఓవర్‌లో 35 పరుగులు పిండుకున్న బుమ్రాIND vs ENG 5th test day 2: అదేం కొట్టుడురా భయ్: ఒక్క ఓవర్‌లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా

ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో సెంచరీ చేసిన నాలుగో భారతీయ క్రికెట్. అతని కంటే ముందు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ ఉన్నారు. ఇదే టెస్ట్ మ్యాచ్ తొలి రోజు రిషభ్ పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్‌లో నమోదైన రెండో సెంచరీ ఇది. 2018 నుంచీ టెస్టుల్లో జడేజా దూకుడుగా ఆడుతూ వస్తోన్నాడు. ఓవల్‌-82, సిడ్నీ-81, మెల్‌బోర్న్-57, ట్రెంట్ బ్రిడ్జ్‌-56 పరుగులు చేశాడు. ఇప్పుడు ఏకంగా సెంచరీ సాధించాడు.

రవీంద్ర జడేజా సెంచరీ పట్ల పలువురు మాజీ క్రికెటర్లు అతణ్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సైతం అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ది బ్లేడ్ ఈజ్ అవుట్ స్వింగింగ్ అంటూ ట్వీట్ చేసింది. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ బౌలర్లు వెంకటేష్ ప్రసాద్, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్, దీప్ దాస్ గుప్తా, వసీీం జాఫర్, మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.. రవీంద్ర జడేజాకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

Story first published: Saturday, July 2, 2022, 17:42 [IST]
Other articles published on Jul 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X