న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 3rd Test: క్షణక్షణానికి అనూహ్యంగా మారే ఇంగ్లాండ్ వెదర్: మూడో టెస్ట్‌పై ఎఫెక్ట్?

IND vs ENG 3rd Test Weather And Pitch Report: No Interruption Of Rain For This entire Match?

లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం లీడ్స్‌లోని హెడింగ్లేలో రెండు జట్లు తలపడబోతోన్నాయి. మొత్తం అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఇందులో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ముందంజలో ఉంటోంది. 1-0 స్కోర్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్.. చివరిరోజు వర్షం వల్ల డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారీ తేడాతో ఇంగ్లాండ్ జట్టును సొంతగడ్డపై మట్టి కరిపించింది. ఇక అదే ఊపుతో మూడో మ్యాచ్‌కు సన్నధ్దమైంది.

తొలి మ్యాచ్ తరహాలో వర్షం అడ్డుపడుతుందా?

తొలి మ్యాచ్ తరహాలో వర్షం అడ్డుపడుతుందా?

మ్యాచ్ ఆరంభమౌతోందనగానే క్రికెట్ ప్రేమికుల కళ్లన్నీ వెదర్ రిపోర్ట్ మీద ఉంటాయి. ఇంగ్లాండ్‌ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తోన్నందున.. ఈ టెస్ట్‌కు కూడా వరుణుడి గండం వెంటాడుతుందేమోననే అనుమానాలు తలెత్తుతుంటాయి. భౌగోళికంగా లీడ్స్.. వెరి విండీ సిటీ. ఈదురు గాలులు తరచూ వీస్తుంటాయి. ఇదే లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియం మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. లీడ్స్‌లో వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని ఇంగ్లాండ్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు అంచనా వేస్తోన్నారు.

18 నుంచి 22 డిగ్రీల వరకు..

18 నుంచి 22 డిగ్రీల వరకు..

వచ్చే అయిదు రోజుల పాటు ఉష్ణోగ్రత 18 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతుందని అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ చివరిదైన అయిదో రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. చివరిరోజును మినహాయిస్తే.. తొలి నాలుగు రోజులు వర్ష సూచనలు పెద్దగా లేవని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోయే గుణం ఇంగ్లాండ్ వాతావరణానికి ఉండటం వల్ల అంచనాలు తప్పొచ్చనే అభిప్రాయాలు సైతం వినిపిస్తోన్నాయి.

పిచ్ రిపోర్ట్ ఏంటీ?

పిచ్ రిపోర్ట్ ఏంటీ?

సాధారణంగా ఎమరాల్డ్ హెడింగ్లే స్టేడియం పిచ్.. బౌన్సీగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. మూడో టెస్ట్ మ్యాచ్‌కు కూడా హెడింగ్లే స్టేడియం నిర్వాహకులు బౌన్సీ పిచ్‌నే ప్రిపేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. టీమిండియా మరోసారి నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌ను రంగంలో దించడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. 4:1 ఫార్ములానే అనుసరించవచ్చనది విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. అదే జరిగితే- స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. అతను మరోసారి బెంచ్‌కే పరిమితం కావచ్చు. ఆల్‌రౌండర్ రోల్ పోషిస్తోన్న రవీంద్ర జడేజా.. స్పిన్ బౌలర్‌గా ఉంటాడు.

 ఆధిక్యంలో భారత్..

ఆధిక్యంలో భారత్..

అయిదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ఆధిక్యతలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్‌ చివరిరోజు మొత్తాన్నీ వరుణ దేవుడు మింగేయడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరుణుడు అడ్డు పడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేని మ్యాచ్ అది. డ్రా కావడం కోహ్లీ అండ్ హిస్ టీమ్‌ను నిరాశ పరిచింది. అయినప్పటికీ- రెండో మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. పేస్ బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించారు. హైదరాబాదీ సిరాజ్ కీలక వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్‌లో మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వరుస వికెట్లను పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు కోలుకోలేకపోయింది.

Story first published: Wednesday, August 25, 2021, 11:28 [IST]
Other articles published on Aug 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X