న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ క్రికెటర్ కేఎస్ భరత్‌పై రోహిత్ శర్మ ప్రయోగం..సక్సెస్: ఓపెనింగ్ జోడీగా: గిల్‌కు ఎసరు

IND vs ENG 2022 5th test: Wicket Keeper KS Bharat likely to open Indias inning

లండన్: భారత్-లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌ మధ్య లీసెస్టర్ స్టేడియంలో ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌‌లో విశాఖ క్రికెటర్ర్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్‌లో లోయర్ ఆర్డర్‌లో బరిలోకి దిగిన భరత్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందాడు. ఏకంగా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించాడు. గిల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ..ఈ విశాఖ క్రికెటర్ మాత్రం క్రీజ్‌లో పాతుకు పోయాడు. 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్‌గా ప్రమోట్..

ఓపెనర్‌గా ప్రమోట్..

ఈ ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్‌ను ఆరంభించాడు. రెండో ఇన్నింగ్‌లో అతని బరిలోకి దిగలేదు. తనకు బదులుగా కేఎస్ భరత్‌ను ఓపెనర్‌గా పంపాడు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది.

కేఎస్ భరత్‌లో సుదీర్ఘ ఇన్నింగ్ ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. టెస్ట్ ఫార్మట్‌కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్‌లో 59 బంతులను ఎదుర్కొని 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇందులో అయిదు ఫోర్లు ఉన్నాయి.

శుభ్‌మన్ గిల్‌కు ఎర్త్..

శుభ్‌మన్ గిల్‌కు ఎర్త్..

ఈ పరిణామం కాస్త శుభ్‌మన్ గిల్‌ స్థానానికి ఎర్త్ పెట్టినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి, మలి ఇన్నింగ్‌లో గిల్ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. తొలి ఇన్నింగ్‌లో గిల్ చేసింది 21 పరుగులే. 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసి, అవుట్ అయ్యాడు. అదే సమయంలో కేఎస్ భరత్ మాత్రం సుదీర్ఘ ఇన్నింగ్ ఆడాడు. 111 బంతులను ఎదుర్కొని 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

 రోహిత్‌ను ఆకర్షించిన భరత్ ఇన్నింగ్..

రోహిత్‌ను ఆకర్షించిన భరత్ ఇన్నింగ్..

కేఎస్ భరత్ క్రీజ్‌లో కుదురుకున్న తీరు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం.. రోహిత్ శర్మను ఆకట్టుకుంది. అందుకే- రెండో ఇన్నింగ్‌లో ఏకంగా తనకు బదులుగా ఓపెనర్‌గా భరత్‌ను పంపించాడు. అతని ఆశలను వమ్ము చేయలేదు భరత్. 59 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇవ్వాళ మళ్లీ ఇన్నింగ్ ఆరంభం కావాల్సి ఉంది. గిల్ అవుట్ అయిన తరువాత కాకినాడ క్రికెటర్ హనుమ విహారి క్రీజ్‌లోకి వచ్చాడు. తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా ఛాన్స్..

టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా ఛాన్స్..

జులై 1వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఆరంభం కానున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌కు కూడా కేఎస్ భరత్.. కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించే అవకాశాలు లేకపోలేదు. శుభ్‌మన్ గిల్ కంటే కేఎస్ భరత్ బ్యాటింగ్ టెస్ట్ ఫార్మట్‌కు తగ్గట్టుగా ఉండటం వల్ల అతని వైపే రోహిత్ శర్మ మొగ్గు చూపుతాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన కేఎస్ భరత్.. సమయోచితంగా ఆడాడు. నాణ్యమైన టెస్ట్ క్రికెటర్ అనిపించుకున్నాడు. కేఎస్ భరత్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు తప్పకపోవచ్చు.

Story first published: Saturday, June 25, 2022, 12:47 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X