న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో కరోనా విస్ఫోటం: తొలుత అశ్విన్..ఇప్పుడు రోహిత్ శర్మ: ఐసొలేషన్‌లో హిట్‌మ్యాన్

IND vs ENG 2022 5th test: Captain Rohit Sharma tested positive for Covid19

ముంబై: జులై 1వ తేదీన భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ఆడనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు మళ్లీ ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి ఈ రెండు జట్లు. ఆ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో ఉంది.

ప్రతిష్ఠాత్మక సిరీస్ వేళ..

ప్రతిష్ఠాత్మక సిరీస్ వేళ..

దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

 రెండో ఇన్నింగ్‌లో రోహిత్ ఆడకపోవడానికి కారణం ఇదే..

రెండో ఇన్నింగ్‌లో రోహిత్ ఆడకపోవడానికి కారణం ఇదే..

ఈ టెస్ట్ మ్యాచ్‌కు సన్నాహకంగా భారత జట్టు లీసెస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. రెండో ఇన్నింగ్‌లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా-56, మహ్మద్ సిరాజ్-1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్‌లో కేప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్‌లోకి రాలేదు. తొలి ఇన్నింగ్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్‌లో కనిపించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాపిడ్ యాంటీ జెన్‌ టెస్ట్‌లో..

రాపిడ్ యాంటీ జెన్‌ టెస్ట్‌లో..

దీనికి కారణం ఇప్పుడు తెలిసింది. రోహిత్ శర్మ‌ కరోనా వైరస్‌ పాజిటివ్. శనివారం రాపిడ్ యాంటీజెన్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో అతను ఐసొలేషన్‌లో ఉంటోన్నాడు. బస చేసిన హోటల్‌లోనే ఐసొలేషన్‌లో గడుపుతున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ డాక్టర్లు ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోన్నారు. కాగా- ఇవ్వాళ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్‌కు డౌటే..

మ్యాచ్‌కు డౌటే..

జులై 1వ తేదీన అయిదో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోన్న పరిస్థితుల్లో హిట్ మ్యాన్ కోవిడ్ బారిన పడటం టీమిండియా క్యాంప్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా అనే విషయం గందరగోళం నెలకొంది. ఇది- రోహిత్ శర్మ కోలుకోవడంపై ఆధార పడి ఉంటుందని బీసీసీఐ అభిప్రాయపడింది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి పూర్తిగా కోలుకోగలిగితేనే తుదిజట్టులో ఉంటాడని చెప్పకనే చెప్పింది.

తొలుత అశ్విన్..

తొలుత అశ్విన్..

ఈ రెండు వారాల వ్యవధిలో కరోనా వైరస్ బారిన పడ్డ టీమిండియా క్రికెటర్లల్లో రోహిత్ శర్మ రెండోవాడు. ఇదివరకు వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కోవిడ్‌కు గురైన విషయం తెలిసిందే. అందుకే అతను ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. జట్టు మొత్తం ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లినప్పటికీ.. అశ్విన్ మాత్రం క్వారంటైన్‌లో గడిపాడు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాతే లండన్ విమానం ఎక్కాడు. ప్రస్తుతం అతను జట్టుతో ఉంటోన్నాడు. ఇప్పుడిక తాజాగా రోహిత్ శర్మ కూడా ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది.

Story first published: Sunday, June 26, 2022, 7:16 [IST]
Other articles published on Jun 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X