న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడీ దాడులు చేస్తోన్న వేళ.. విరాట్ కోహ్లీకి షాకిచ్చిన వివో

IND vs ENG 2022 2nd T20: Vivo pulls out all ads featuring Virat Kohli, after ED raids

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో.. తరచూ వివాదాల్లో నిలుస్తోంది. పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటోందీ కంపెనీ. ఏకంగా 62,476 కోట్ల రూపాయల మేర పన్నును చెల్లించకుండా, ఆ మొత్తాన్ని చైనాకు తరలించిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ధృవీకరించారు. భారత్‌లోని వివో మొబైల్స్‌ స్టోర్స్, తయారీ యూనిట్లపై వారు దాడులు చేశారు. 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగాయి.

ఆ స్టార్ బౌలర్‌పై వేటు వేసినప్పుడు.. విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించకూడదు: కపిల్ దేవ్ఆ స్టార్ బౌలర్‌పై వేటు వేసినప్పుడు.. విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించకూడదు: కపిల్ దేవ్

వాణిజ్య ప్రకటనల నిలిపివేత..

వాణిజ్య ప్రకటనల నిలిపివేత..

ఈ పరిస్థితుల మధ్య వివో యాజమాన్యం.. టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ నటించిన అడ్వర్టయిజ్‌మెంట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతను నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తాత్కాలికమేనని పేర్కొంది. టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్న వాణిజ్య ప్రకటనలు అవి. వాటికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇదవరకే పూర్తయింది కూడా.

విమర్శల నుంచి తప్పించినట్టుగా..

విమర్శల నుంచి తప్పించినట్టుగా..

టెలికాస్ట్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో వాటన్నింటినీ నిలిపివేస్తున్నట్లు వివో యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది తాత్కాలికమేనని, ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించుకున్న తరువాత వాటిని ప్రసారం చేస్తామని పేర్కొంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం అటు విరాట్ కోహ్లీకి కూడా మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. అడ్వర్టయిజ్‌మెంటె టెలికాస్ట్ మొదలైన తరువాత సోషల్ మీడియాలో ఆయనపై వెల్లువెత్తే విమర్శల బారి నుంచి తప్పించినట్టువుతుందని పేర్కొంది.

వివోతో విరాట్..

వివోతో విరాట్..

గత ఏడాది ఏప్రిల్‌లో విరాట్ కోహ్లీ.. వివోతో అసోసియేట్ అయ్యారు. బ్రాండ్ అంబాసిడర్‌గా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివో మాత్రమే కాకుండా.. ఆడి లగ్జరీ కార్లు, అమెరికన్ టూరిస్టర్ లగేజీ, ప్యూమా స్పోర్ట్స్‌వేర్, టిస్సాట్ వాచీలు, మింత్రా ఫ్యాషన్, గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్, హైపరైస్ వెల్‌నెస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్నారు. గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాటాలు కూడా ఉన్నాయి.

వివో.. వివాదాస్పదం..

వివో.. వివాదాస్పదం..

కాగా- ప్రస్తుతం వివో స్మార్ట్‌ఫోన్ల యాజమాన్యం కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నిఘా పెట్టింది. దేశంలో ఆయా కంపెనీ వ్యవహారాలను తన రాడార్ పరిధిలోకి తీసుకొచ్చింది. వివోతో అసోసియేట్ అయివున్న 23 కంపెనీలు భారీ మొత్తంలో నిధులను చైనాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయా కంపెనీ మీద. మొత్తం వివో స్మార్ట్ ఫోన్ల విక్ర‌యాలు 1,25,185 కోట్ల రూపాయలుగా తేలగా.. అందులో సగం మొత్తం అంటే.. 62,476 కోట్ల రూపాయలను చైనాకు పంపించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు.

Story first published: Saturday, July 9, 2022, 14:45 [IST]
Other articles published on Jul 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X