IND vs CSXI: చెలరేగిన సిరాజ్, ఉమేశ్.. కుప్పకూలిన కౌంటీ టీమ్.. రోహితసేనకు భారీ ఆధిక్యం!

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీఎలె‌వన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. సమష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ రెండో రోజైన బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (3/22), మహమ్మద్‌ సిరాజ్‌ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు.

సుందర్ విఫలం..

సుందర్ విఫలం..

అతను మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారత్‌ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ మిల్స్‌ నాలుగు వికెట్లు తీశాడు.

 కోహ్లీ ప్రాక్టీస్ షురూ..

కోహ్లీ ప్రాక్టీస్ షురూ..

వెన్ను నొప్పితో వామప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశాడు. వామప్ మ్యాచ్‌లో సెకండ్ డే లంచ్ బ్రేక్‌లో విరాట్ నెట్ సెషన్ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్‌లో కెప్టెన్ డిఫెన్స్‌తో పాటు అటాకింగ్ షాట్స్‌ను సరిచూసుకున్నాడు. సోమవారం కోహ్లీకి బ్యాక్ పెయిన్ రావడంతో ఫిజియో సలహా మేరకు విశ్రాంతి తీసుకున్నాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఎడమకాలు హ్యామ్‌స్ట్రింగ్‌కు ఇంజెక్షన్ ఇచ్చారు.

 సెంచరీ హీరోకు చోటు..

సెంచరీ హీరోకు చోటు..

ఆట చివరి రోజు సంచలన ప్రదర్శనలు నమోదైతేనే మ్యాచ్ ఫలితం తేలనుంది. దాదాపు డ్రాగా ముగిసినట్లే. ఇక సెంచరీతో ఆకట్టుకున్నహసీబ్ హమీద్‌కు ఇంగ్లండ్ జట్టు నుంచి పిలుపు అందింది. భారత్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్‌‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి తిరిగి రాగా.. గాయాలతో ఇబ్బంది పడుతున్న జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు.

 ఇంగ్లండ్ జట్టు..

ఇంగ్లండ్ జట్టు..

జోరూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, డామ్ బెస్, క్రిస్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలే, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒలీ పోప్, రాబిన్సన్, సిబ్లే, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 22, 2021, 9:08 [IST]
Other articles published on Jul 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X