న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌లో టీమిండియా: అందరి కళ్లు ఆ ముగ్గిరిపైనే!

India vs Australia 1st ODI : Teams Arrive Under High Security For Hyderabad ODI
Ind vs Aus: Teams arrive under high security for Hyderabad ODI

హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందు ఆఖరి వన్డే సిరిస్ ఆడేందుకు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలి వన్డే మ్యాచ్ కోసం భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లు గురువారం హైదరాబాద్‌ చేరుకున్నాయి. రెండో టీ20 ముగిసిన అనంతరం ఇరు జట్లకు చెందిన క్రికెటర్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆస్ట్రేలియా చేతిలో ఓటమి: జట్టు ఎంపికపై మాజీలు తీవ్ర విమర్శలుఆస్ట్రేలియా చేతిలో ఓటమి: జట్టు ఎంపికపై మాజీలు తీవ్ర విమర్శలు

ఉప్పల్‌లో తొలి వన్డే

ఉప్పల్‌లో తొలి వన్డే

అనంతరం భారీ భద్రత మధ్య విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఇరు జట్లను తాము బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే శనివారం నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ ఆడబోయే జట్టు కూర్పును సరిచూసుకోవడానికి జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇదే ఆఖరి అవకాశం. ఈ సిరిస్ కేఎల్‌ రాహుల్‌, జడేజా, విజయ్‌ శంకర్‌లకు అగ్ని పరీక్షే.

వరల్డ్‌కప్ ముంగిట ఆఖరి వన్డే సిరిస్

వరల్డ్‌కప్ ముంగిట ఆఖరి వన్డే సిరిస్

ఎందుకంటే.. ఈ సిరిస్‌లో సత్తా చాటితేనే వాళ్లు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. కాగా, భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్‌ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. గతంలో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉండటంతో భారత్‌పై అలవోక విజయాలను అందుకుంది.

ఫేవరేట్‌గా టీమిండియా

ఫేవరేట్‌గా టీమిండియా

అయితే, గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడం.. అదే సమయంలో ఆస్ట్రేలియా బలహీనపడింది. ఈ ఏడాది మొదట్లో సొంతగడ్డ కోహ్లీసేనతో జరిగిన వన్డే సిరిస్‌ను చేజార్చుకుంది. దీంతో అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా మెరుగైన జట్టుగా ఉంది. దీంతో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

వరల్డ్‌కప్ జట్టుపై స్పష్టత

వరల్డ్‌కప్ జట్టుపై స్పష్టత

ఆస్ట్రేలియా శనివారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరిస్‌తో వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే భారత జట్టు స్పష్టంగా తెలియనుంది. ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లు ఉండగా బ్యాకప్‌గా రాహుల్, మిడిలార్డర్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, కీపింగ్‌లో ధోనికి తోడుగా పంత్, పేస్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్, భువనేశ్వర్, బుమ్రా, షమీలు ఎంపికయ్యే అవకాశం ఉంది.

Story first published: Friday, March 1, 2019, 12:00 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X