న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంతోషంతో చిన్నపిల్లల్లా కోహ్లీ, రోహిత్ సెలబ్రేషన్స్.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న వీడియో

Ind vs Aus : Rohit, Virat Celebrations At Pavilion Stairs Viral on Social media, They Joyed Together like a Children

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆసీస్ మూడో టీ20 రసవత్తరంగా కడవరకు సాగింది. చివరికి భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆసీస్‌పై 2-1తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఢిఫెండింగ్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఆసీస్‌ను ఓడించడం భారత జట్టుకు కొండంత బూస్టప్ ఇవ్వడం ఖాయం. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 186పరుగులు చేయగా.. 187పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 19.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్ కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు చివర్లో పాండ్యా (25) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయలాంఛనాన్ని ముగించాడు.

చివరి ఓవర్ రెండో బంతికి కోహ్లీ ఔటవ్వడంతో..

ఈ మ్యాచ్ చివర్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరి 2 ఓవర్లో 21పరుగులు కావాల్సిన దశలో క్రీజులో హార్దిక్, కోహ్లీ ఉన్నారు. 19వ ఓవర్ క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా తొలి బంతికి సిక్స్ కొట్టి సమీకరణాన్ని కాస్త కరిగిస్తాడు. అయితే రెండో బంతికి సింగిల్, వరుసగా కోహ్లీ 3, 4వ బంతులను డాట్ చేస్తాడు. 5వ బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక్క పరుగు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 11పరుగులు కావాల్సిన తరుణంలో.. డేనియల్ సామ్స్ వేసిన 20ఓవర్ తొలి బంతికి కోహ్లీ సిక్స్ బాదడంతో ఇక గెలుపు మనదే అనిపించింది. 5బంతుల్లో 5పరుగులు మాత్రమే కావాలి. అయితే 2వ బంతికి కోహ్లీ క్యాచ్ ఔట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ తారస్థాయికి చేరింది.

మెట్లపైనే కోహ్లీ, రోహిత్ కూర్చుని..

ఇక ఫించ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు షాకైన కోహ్లీ పెవిలియన్ వైపు కదిలాడు. అయితే డ్రెస్సింగ్ రూంకు వెళ్లకుండా మెట్ల మీదే కూర్చుని చివరి వరకు టెన్షన్ టెన్షన్‌గా మ్యాచ్ చూశాడు. పక్కనే రోహిత్ శర్, వెనకాల తర్వాత బ్యాటింగ్‌కు దిగాల్సిన హర్షల్ పటేల్ ఉన్నారు. ఇక చివరి ఓవర్ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన డీకే.. సింగిల్ తీశాడు. నాలుగో బంతికి హార్దిక్ ఒక బంతి డాట్ చేయడంతో 2బంతుల్లో 4పరుగులు కావాల్సొచ్చింది. అయితే 5వ బంతికి హార్దిక్ కట్ షాట్ ఆడగా.. బంతి బ్యాక్ సైడ్ ఫోర్ వెళ్లింది. దీంతో ఇండియా మరో బంతి ఉండగానే విజయాన్ని ముద్దాడింది. ఇక మెట్లపై కూర్చున్న కోహ్లీ, రోహిత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వీరిద్దరు ఒకరినొకరు హైఫై ఇచ్చుకుంటూ హగ్ చేసుకున్న విధానం.. యావత్ భారత క్రికెట్ ప్రేమికులను హత్తుకుంది. ఆనందంతో చిన్నపిల్లలయిపోయిన కోహ్లీ, రోహిత్‌ను చూసి నెటిజన్లు తెగ సంతోషపడుతూ పోస్టులు చేస్తున్నారు.

తొలుత అక్షర్ పటేల్, చాహల్ రాణించడంతో..

ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత ఇండియా బౌలింగ్ చేయగా.. అక్షర్ పటేల్ (4-0-33-3) నాలుగు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు ఓ కీలక రనౌట్ చేసి రాణించాడు. చాహల్ 4ఓవర్లలో 22 పరుగులిచ్చి 1వికెట్ తీశాడు. ఇకపోతే ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (52పరుగులు 21బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) ఉన్నంత సేపు దడదడలాడించగా.. టిమ్ డేవిడ్ (54పరుగులు 27బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) చివర్లో హాఫ్ సెంచరీతో హడలెత్తించాడు. అతనికి తోడు డేనియల్ సామ్స్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) కాస్త విలువైన పరుగులు జోడించాడు. దీంతో ఆసీస్ 7వికెట్లు కోల్పోయి 186పరుగులు చేయగలిగింది.

Story first published: Monday, September 26, 2022, 8:15 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X