న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడిలైడ్ టెస్ట్: ఆస్ట్రేలియాపై అరుదైన రికార్డు నెలకొల్పిన ఇషాంత్ శర్మ

India vs Australia 1st Test Day 2: Ishant Sharma Completes 50 Test wickets Against Australia
Ind vs Aus: Ishant Sharma completes 50 Test wickets against Australia, gets praised by fans for his brilliance

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్‌ని క్లీన్‌బౌల్డ్ చేసిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత కెప్టెన్ టిమ్‌ పైన్‌(5)ని కూడా భలేగా బురిడీ కొట్టించాడు.

 ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా

ఈ మ్యాచ్‌లో ఈ రెండు వికెట్లు తీయడం ద్వారా ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డుని ఇషాంత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్ తీసిన బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..

కల్లిస్ ఆస్ట్రేలియాపై 28 టెస్టుల్లో 50 వికెట్లు తీయగా

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ కల్లిస్ ఆస్ట్రేలియాపై 28 టెస్టుల్లో 50 వికెట్లు తీయగా... ఇషాంత్ శర్మ కేవలం 23 టెస్టుల్లోనే ఆ ఘనత అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియాపైనే కాదు.. ఇంగ్లాండ్‌పైనా ఇషాంత్ శర్మ 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ ఇప్పటి వరకు 88 టెస్టులాడి 258 వికెట్లు పడగొట్టాడు.

టెస్టుల్లో ఇషాంత్ శర్మ యావరేజి 34.59

టెస్టుల్లో ఇషాంత్ శర్మ యావరేజి 34.59గా ఉండగా.. ఎకానమీ 3.21గా ఉంది. ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(61), మిచెల్ స్టార్క్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా ఆస్ట్రేలియా 59 పరుగులు వెనుకబడి ఉంది.

Story first published: Friday, December 7, 2018, 14:14 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X