న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: పైన్-కోహ్లీల మధ్య మాటల యుద్ధం (వీడియో)

India Vs Australia 2nd Test : Kohli,Tim Paine Take Rivalry To Whole New Level,Umpire Interferes
Ind vs Aus 2nd Test, Day 4: Watch Tim Paine, Virat Kohli take rivalry to whole new level, umpire interferes

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు టిమ్ పైన్, విరాట్ కోహ్లీల మధ్య మాటల యుద్ధం వాతావరణాన్ని వేడెక్కించింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు.

పెర్త్ టెస్టులో నోటికి పని చెప్పిన విరాట్ కోహ్లీ

రెండో టెస్టులో భాగంగా మూడో రోజైన ఆదివారం ఆట చివరి ఓవర్‌లో పైన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు విరాట్‌ కోహ్లీ నోటికి పని చెప్పాడు. పలుమార్లు ఔటవ్వకుండా తప్పించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌ దగ్గరకు వెళ్లి ‘మీరు ఇలా ఆడితే సిరీస్‌ 2-0గా మారుతుంది' అని హెచ్చరించాడు.

పైన్ సైతం అదే రీతిలో సమాధానం

దీనికి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీరు ముందు బ్యాటింగ్‌ చేయాల్సింది కదా బిగ్‌హెడ్‌‌' అని ఎదురు సమాధానమిచ్చాడు.. టిమ్ పైన్‌ కూడా తిరుగు సమాధానం చెప్పడం స్టంప్‌ మైక్రోఫోన్‌లో స్పష్టంగా వినిపించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మీడియా సమావేశంలో నాథన్ లియాన్ ఇలా

మీడియా సమావేశంలో నాథన్ లియాన్ ఇలా

మూడో రోజు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పైన్-కోహ్లీల మధ్య ఏం జరిగిందని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను విలేకరులు ప్రశ్నించగా... విరాట్ కోహ్లీ డిన్నర్‌కి ఎక్కడి వెళతాడని ఆస్ట్రేలియా కెప్టెన్ అడిగాడని తనదైన శైలిలో హాస్యం పండించాడు. ప్రస్తుతం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

కోహ్లీ సంబరాలపై ఆసీస్ మాజీ క్రికెటర్లు మండిపాటు

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లీ తీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. పెర్త్ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కి దిగడం, ఔటైనప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

1
43624
Story first published: Monday, December 17, 2018, 12:11 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X