న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ రికార్డుల్లో రోహిత్ శర్మను దాటి వెళ్లే మొనగాడు ఉన్నాడా?

IND vs AUS 2022 2nd T20I: Check out here for Rohit Sharmas T20I records including as Captain

ముంబై: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్లు తేడాతో ప్రత్యర్థిపై వార్ వన్‌సైడ్ చేసింది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌లో భారత్ చెలరేగింది. తొలుత బౌలింగ్, ఆ తరువాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్ల భరతం పట్టారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చివర్లో దినేష్ కార్తీక్ తనదైన శైలిలో ఆడాడు.

 హిట్‌మ్యాన్ స్టైల్..

హిట్‌మ్యాన్ స్టైల్..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్‌ ఎనిమిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్ కేప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 20 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఈ టార్గెట్‌ను టీమిండియా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. రోహిత్ శర్మ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

టీ20లపై జెండా..

టీ20లపై జెండా..

టీ20 ఇంటర్నేషనల్స్‌పై రోహిత్ శర్మ జెండా పాతాడు. తిరుగులేని రికార్డును అందుకున్నాడు. ఏ కేప్టెన్ గానీ కల్లో కూడా ఊహించలేని రికార్డులు అవి. సాధారణంగా టీ20 వంటి ఫార్మట్‌లో గెలుపోటములనేవి ప్లేయర్ల ఆటతీరు కంటే కేప్టెన్ పన్నే వ్యూహాల మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. తక్కువ ఓవర్లల్లో భారీ స్కోర్లను సాధించడం- ప్రత్యర్థిని కట్టడి చేయడం, స్పెషలిస్ట్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే పెవిలియన్ పంపించేలా పావులను కదపాల్సి ఉంటుంది. వాటిని రోహిత్ శర్మ సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు.

ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా..

ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా..

కేప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా.. ఓ బ్యాటర్‌గా కూడా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోన్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటివరకు టీమిండియా తరఫున అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడమే దీనికి నిదర్శనం. ఇప్పటివరకు రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్స్‌లో డజనుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సెలెక్ట్ అయ్యాడు. అతని కంటే విరాట్ కోహ్లీ ఒక్క అడుగు ముందున్నాడు. కోహ్లీ ఖాతాలో ఉన్న సంఖ్య.. 13.

కేప్టెన్‌గా కూడా..

కేప్టెన్‌గా కూడా..

ఒక ఇన్నింగ్‌లో అత్యధిక ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మే. ఇప్పటివరకు అతను 43 ఫోర్లు/సిక్సర్లు కొట్టాడు. మహేంద్రసింగ్ ధోనీ-22, యువరాజ్ సింగ్-14, వీరేంద్ర సెహ్వాగ్-13, సచిన్ టెండుల్కర్-12, సౌరవ్ గంగూలీ-12, విరాట్ కోహ్లీ-11 ఫోర్లు/సిక్సర్లు కొట్టారు. కేప్టెన్‌గా తిరుగులని రికార్డ్ రోహిత్ శర్మకు ఉంది.

ఇప్పటివరకు టీ20ల్లో 41 ఇన్నింగ్స్‌ ఆడాడీ హిట్ మ్యాన్. 1,351 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 36.51. స్ట్రైక్ రేట్ 154.93తో తన వ్యక్తిగత స్కోరింగ్‌ను పరుగలు పెట్టించాడు. అత్యధిక విజయాలను అందుకున్న కేప్టెన్‌గా కూడా హిట్ మ్యాన్ తన పేరును లిఖించుకున్నాడు.

Story first published: Saturday, September 24, 2022, 9:43 [IST]
Other articles published on Sep 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X