న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'తేడా నాథన్ లియానే, టెస్టు సిరిస్‌లో ఆసీస్ విజయం సాధిస్తుంది'

Ind vs Aus 2018: Former England captain Michael Vaughan predicts result of India-Australia Test series

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు విజయం సాధిస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి.

<strong>ఇయర్ ఎండ్ స్పెషల్ 2018: టెస్టుల్లో టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు వీరే..</strong>ఇయర్ ఎండ్ స్పెషల్ 2018: టెస్టుల్లో టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు వీరే..

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు 146 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26న ప్రారంభం కానుంది.

ట్విట్టర్‌లో మైకేల్ వాన్

ఈ టెస్టు సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న మైకేల్ వాన్ ట్విట్టర్‌లో "ఆసీస్ పర్యటనపై ఫైనల్ థాట్... టెస్టు సిరిస్‌ను ఆస్టేలియా గెలుచుకుంటుంది.... తేడా నాథన్ లియానే. ఏది అయితేనేం, మళ్లీ చలిలోకి... జనవరి త్వరగానే" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

 287 పరుగుల విజయ లక్ష్యంతో

287 పరుగుల విజయ లక్ష్యంతో

ఈ సిరిస్‌లో నాథన్ లియాన్ అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సైతం ఎనిమిది వికెట్లు తీసిన నాథన్ లియాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను తన బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు.

 జట్టు విజయంలో కీలకపాత్ర

జట్టు విజయంలో కీలకపాత్ర

కీలక సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ మురళీ విజయ్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య జరగనున్న మూడో టెస్టుకు మెల్ బోర్న్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టుని ఇరు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

 టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేల సిరిస్

టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేల సిరిస్

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ ముగిసిన అనంతరం ఇరు జట్లు మూడు వన్డేల సిరిస్ ఆడనున్నాయి. జనవరి 12, 15, 18 తేదీల్లో మూడు వన్డేల సిరిస్ జరగనుంది. ఈ సిరిస్‌లో భాగంగా తొలుత జరిగిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 21, 2018, 18:30 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X