న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టు: పృథ్వీ షా సెంచరీ, తొలిరోజు హైలెట్స్ ఇవే (ఫోటోలు)

In Pics: Prithvi Shaw Becomes Youngest Indian to Score a Century on Debut

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతగా అనుభవం లేని వెస్టిండిస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మన్ ఓ ఆటాడుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

గణాంకాలు: ఒక్క సెంచరీతో పృథ్వీషా ఖాతాలో రికార్డుల వెల్లువగణాంకాలు: ఒక్క సెంచరీతో పృథ్వీషా ఖాతాలో రికార్డుల వెల్లువ

యువ ఓపెనర్ పృథ్వీ షా (134) సెంచరీతో పాటు పుజారా (86), కోహ్లీ (72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(72 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు.

రాజ్‌కోట్ టెస్ట్‌లో మొదటి రోజు హైలెట్స్ ఇవే...:

 పృథ్వీషా హాఫ్ సెంచరీ

పృథ్వీషా హాఫ్ సెంచరీ

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ పృథ్వీషా 56 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో అర్ధ శతకం సాధించాడు. తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగాడు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ పృథ్వీషా ఎక్కడా తడబడలేదు.

పుజారా హాఫ్ సెంచరీ

పుజారా హాఫ్ సెంచరీ

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో భారత బ్యాట్స్‌మన్ పుజారా అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు.

పృథ్వీషా సెంచరీ అభివాదం

పృథ్వీషా సెంచరీ అభివాదం

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న అరంగేట్ర టెస్టులో ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు. తద్వారా గంగూలీ, సెహ్వాగ్‌ తదితర దిగ్గజాల సరసన చేరాడు.

సెంచరీ అనంతరం ఎగిరి గంతేసిన పృథ్వీషా

సెంచరీ అనంతరం ఎగిరి గంతేసిన పృథ్వీషా

అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు. దీంతోపాటు అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడిగా పృథ్వీషా నిలిచాడు.

అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన ఆనందంలో పృథ్వీషా

అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన ఆనందంలో పృథ్వీషా

అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన ఆనందంలో పృథ్వీషా సంబరాలు చేసుకుంటోన్న దృశ్యం. ఈ మ్యాచ్‌లో సెంచరీతో పృథ్వీషా అనేక రికార్డులు నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన పృథ్వీ షా... ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో కూడా తమిళనాడుపై 120 బాదిన పృథ్వీషా... దులీప్ ట్రోఫీ ఆరంగేట్ర మ్యాచ్‌లో కూడా 154 పరుగులు చేసి అదరగొట్టాడు.

 కోహ్లీ, రహానే సెంచరీ భాగస్వామ్యం

కోహ్లీ, రహానే సెంచరీ భాగస్వామ్యం

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రహానే (41)తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. రోస్టన్‌ చేజ్‌ వేసిన 83.3వ బంతిని ఆడబోయిన రహానే కీపర్‌ డోవ్రిచ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. భారత్ స్కోరుని 300 దాటించిన ఈ జోడీ జట్టు స్కోరు 337 పరుగుల వద్ద రహానే ఔటవడంతో విడిపోయింది.

బ్యాటింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

బ్యాటింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

నిలకడగా ఆడుతున్న రహానే (41) పరుగుల వద్ద ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. రోస్టన్‌ చేజ్‌ వేసిన 83.3వ బంతిని ఆడబోయిన అజింక్య కీపర్‌ డోవ్రిచ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీనికి ముందు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (66) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

ఔటైన తర్వాత నిరాశగా వెనుదిరుగుతున్న రహానే

ఔటైన తర్వాత నిరాశగా వెనుదిరుగుతున్న రహానే

ఈ మ్యాచ్‌లో రహానే (41) పరుగుల వద్ద ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. రోస్టన్‌ చేజ్‌ వేసిన 83.3వ బంతిని ఆడబోయిన అజింక్య కీపర్‌ డోవ్రిచ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అభివాదం

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అభివాదం

భారత స్కోరు 232/3 క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రహానే (41)తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 19:46 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X