న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ టెస్టు: ఇషాంత్ ఖాతాలో అరుదైన రికార్డు, కపిల్‌కు చేరువగా

By Nageshwara Rao
Ishant Sharma Adds Alastair Cook's Prolonged Woes
In Numbers: Ishant Sharma Adds to Alastair Cooks Prolonged Woes

లండన్: 'టెస్టుల్లో 15వేల పరుగులు, 50 సెంచరీలు చేసే సత్తా అతనికి ఉంది' ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు ముందు ఆ జట్టు బ్యాట్స్‌మన్ అలెస్టర్ కుక్ గురించి మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్న మాట ఇది. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో కుక్ ఒకడు. ఇంగ్లాండ్ తరుపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డుని కూడా కలిగి ఉన్నాడు.

టెస్టుల్లో 12వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ కూడా అలెస్టర్ కుకే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతేకాదు కుక్ లాంటి గొప్ప ఆటగాడిని ఒకే బౌలర్ ఎక్కువసార్లు ఔట్ చేస్తే అది నిజంగా అద్భుతమే.

 ఆ తర్వాతి స్థానంలో ఇషాంత్ శర్మ

ఆ తర్వాతి స్థానంలో ఇషాంత్ శర్మ

కుక్‌ను దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ అత్యధికంగా 12 సార్లు ఔట్ చేశాడు. ఇప్పుడు అతని తర్వాత స్థానంలో ఇషాంత్ శర్మ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో కోహ్లీసేన ఓడిపోయింది.

మూడో టెస్టులో విజయం దిశగా టీమిండియా

మూడో టెస్టులో విజయం దిశగా టీమిండియా

నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం విజయం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పెవిలియన్‌కు పంపాడు. రెండో టెస్టులో కూడా కుక్‌ను ఇషాంత్ శర్మే పెవిలియన్‌కు చేర్చడం విశేషం.

కుక్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ

కుక్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ

మొత్తం మీద ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు సార్లు కుక్‌ను ఇషాంత్ ఔట్ చేశాడు. దీంతో మొత్తంగా కుక్‌ను ఇషాంత్ 11 సార్లు ఔట్ చేసినట్లయింది. దీంతో ఇషాంత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. కపిల్ దేవ్ తరవాత ప్రత్యర్థి బ్యాట్సమన్‌ను ఓ భారత బౌలర్ ఇన్ని ఎక్కువ సార్లు ఔట్ చేయడం ఇదే తొలిసారి.

అత్యధికంగా 12 సార్లు

అత్యధికంగా 12 సార్లు

పాక్ బ్యాట్స్‌మన్ ముదాసర్ నాజర్‌ను కపిల్ దేవ్ అత్యధికంగా 12 సార్లు ఔట్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహం గూచ్‌ను 11 సార్లు ఔట్ చేశాడు. 10కి పైగా సార్లు నలుగురు బ్యాట్స్‌మన్లను కపిల్ దేవ్ ఔట్ చేయడం విశేషం. అలెన్ బోర్డర్‌, డేవిడ్ గోవర్‌లను కూడా 10 సార్లు కపిల్ దేవ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక, ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను 10 సార్లు ఔట్ చేసిన బౌలర్లలో హర్భజన్ సింగ్, అశ్విన్ కూడా ఉన్నారు. రికీ పాంటింగ్‌ను హర్భజన్ 10 సార్లు ఔట్ చేయగా.. అలెస్టర్ కుక్‌ను అశ్విన్ 10 సార్లు బోల్తా కొట్టించాడు.

1
42376
Story first published: Tuesday, August 21, 2018, 20:30 [IST]
Other articles published on Aug 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X