న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌కి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాక!

Imran Khan to Watch India-Pakistan Asia Cup Match in Dubai: Reports

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి ఇటీవలే పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన జియో టీవీ ఛానెల్ వెల్లడించింది.

దుబాయిలో జరిగే మ్యాచ్‌ను ఆయన స్వయంగా తిలకించాలనుకుంటున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ తన రెండు రోజులు పర్యటన నిమిత్తం మంగళవారం సౌదీ అరేబియాకు బయల్దేరారు. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన దుబాయి వెళ్లనున్నారని సమాచారం.

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ వెళ్తోన్న తొలి విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పర్యటించనున్నారు. ఆసియా కప్‌ సెప్టెంబరు 15న ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ హాజరుకానున్నారనే వార్తలపై

ఇమ్రాన్ ఖాన్ హాజరుకానున్నారనే వార్తలపై

అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కి ఇమ్రాన్ ఖాన్ హాజరుకానున్నారనే వార్తలపై ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. ఆయన వస్తే పాక్‌ ఆటగాళ్లకు చాలా ఎనర్జీ వస్తుందని, ఇది ఆటతీరును తప్పక మెరుగు పరుస్తుందని అన్నాడు. ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు.

భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి

భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి

ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తోంది. ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి. ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 6 సార్లు నెగ్గగా, పాక్ 5 సార్లు విజయం సాధించింది.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ

ఒకసారి ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన దేశంగా భారత్‌కు పేరుంది. ఆసియా కప్‌ను భారత్ ఆరు సార్లు నెగ్గగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే సాధించింది. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 12 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 45.90 యావరేజితో 459 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

Story first published: Tuesday, September 18, 2018, 18:51 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X