న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గంగూలీని కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుంది.. స్టీవ్‌వాకు దాదా ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ చూశాక..'

If you poked Sourav Ganguly, you were going to get it back says Graeme Smith

జొహాన్నెస్‌బర్గ్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ ‌స్మిత్‌ అన్నాడు. ఎవ్వరైనా సరే అనవసరంగా రెచ్చగొడితే.. దాదా బదులిచ్చే తీరు అద్భుతమని ప్రశంసించాడు. మైదానంలో తామిద్దరం కవ్వించుకున్న సందర్భాలు ఉన్నాయని స్మిత్‌ తెలిపాడు. భారత జట్టుని 2000ల్లో ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు గంగూలీ ఎంతో శ్రమించాడని ‌చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో దాదా 113 టెస్టుల్లో, 311 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుంది

కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుంది

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో తాజాగా గ్రేమ్ ‌స్మిత్‌ మాట్లాడుతూ... 'సౌరవ్ గంగూలీని ఎవరైనా కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుందని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నేను ఎక్కువ సమయం దాదాతో గడుపుతున్నా. ప్రత్యేకించి క్రికెట్ పరిపాలనకు సంబంధించి చాలా ఎక్కువగా చర్చిస్తున్నాను. అతనెప్పుడూ ప్రశాంతంగా మాట్లాడాలని అనిపించే విధంగా ఉంటాడు. దాదా మంచి సంభాషణలను ఇష్టపడతాడు' అని తెలిపాడు. గ్రేమ్ ‌స్మిత్ దక్షిణాఫ్రికా తరఫున 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 37 శతకాలు బాదాడు.

దాదా వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది

దాదా వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది

నాట్‌వెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా 2002లో లార్డ్స్ ‌బాల్కనీలో సౌరవ్ గంగూలీ సంబరాలను గ్రేమ్ స్మిత్‌ గుర్తుచేసుకున్నాడు. 'నాకు తెలిసి ప్రతిఒక్కరికి ఆ సంబరాలు గుర్తుంటాయి. గంగూలీని అలా చూడటం చాలా బాగుంటుంది. కొద్దిగా నవ్వు తెప్పించినా.. ఆ వేడుకల్లో అతడికున్న అభిరుచి కనిపించింది. ఇంగ్లండ్‌లో నాట్‌వెస్ట్‌ ట్రోఫీ అందుకోవడం, భారత్‌కు గెలుపు ఎంత అవసరమో ఆ సంబరాలు చూపించాయి. విదేశాల్లో గెలిస్తే భారత క్రికెట్‌ ముందుకుపోతుంది. ఇప్పుడు మేం చర్చిస్తున్న దానికి ఆ వీడియో సరైన ప్రతీక. అయినప్పటికీ కొన్నిసార్లు ఆ వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది' అని దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్ స్మిత్‌ అన్నాడు.

స్టీవ్‌వాకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ చూశాక

స్టీవ్‌వాకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ చూశాక

మైదానంలో దాదా, నేను కవ్వించుకున్న సందర్భాలు ఉన్నాయని గ్రేమ్ స్మిత్‌ తెలిపాడు. టాస్‌ విషయంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ ‌వాకు దాదా ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ చూశాక మళ్లీ ఎప్పుడూ కవ్వించలేదన్నాడు. యువ కెప్టెన్‌ కావడంతో కాస్త దుందుడుకుగా ఉండేవాడినని, అయితే గంగూలీ దీటుగా బదులిచ్చేందుకు ఎప్పుడూ వెనుకాడలేదని ఆయన గుర్తుచేసుకున్నాడు. 2003లో 22 ఏళ్ళ వయసులో గ్రేమ్ స్మిత్‌ దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు అందుకుని చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ఎంపికైన మొదటివాడు స్మిత్. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్బుత విజయాలు అందించాడు.

ధోనీ అంటే తెలియని వారు ఉన్నారా?

ధోనీ అంటే తెలియని వారు ఉన్నారా?

టీమిండియా మాజీ కెప్టెన్‌ 'మిస్టర్‌ కూల్'‌ ఎంఎస్ ధోనీని‌ గ్రేమ్ స్మిత్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. అయ్య బాబోయ్.. అసలు ధోనీ తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం వ్యక్తం చేశాడు. మహీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరంటూ స్మిత్‌ కొనియాడాడు. ఇంకా ధోనీ గురించి మాట్లాడుతూ... అతను చాలా సౌమ్యుడని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ప్రశంసించాడు. మహీ అంటే తనకి ఎంతో గౌరవం అని స్మిత్‌ పేర్కొన్నాడు.

బంతిని మాత్రమే చూసి బలంగా బాదమని రాహుల్‌ భాయ్‌ చెప్పాడు: రహానే

Story first published: Monday, July 13, 2020, 18:27 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X