Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంతిని మాత్రమే చూసి బలంగా బాదమని రాహుల్‌ భాయ్‌ చెప్పాడు: రహానే

In T20 cricket just watch the ball and hit it: Ajinkya Rahane reveals Rahul Dravid’s advice

ముంబై: టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే తన అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో రహానే కీలక ఆటగాడు. విదేశాల్లోనూ బాగా బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మన్లలో ఒకడు‌. ఇప్పటివరకు 65 మ్యాచ్‌ల్లో 11 శతకాలతో కొనసాగుతున్నాడు. 2016లో చివరిసారి టీ20 ఆడిన రహానే.. 2018 ఫిబ్రవరిలో చివరిసారి వన్డే మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచీ పొట్టి క్రికెట్‌కు దూరమైన రహానే మళ్లీ ఆయా ఫార్మాట్లలో రాణించాలనుకుంటున్నాడు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఎంతో మెరుగైన అజింక్య రహానే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. తాజాగా దీప్‌దాస్‌ గుప్తాతో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రహానే తన బ్యాటింగ్‌ విషయంలో ద్రవిడ్‌ చేసిన సూచనలు వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రహానే ఇప్పటివరకు 65 టెస్టుల్లో, 90 వన్డేల్లో, 20 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 14 సెంచరీలు బాదాడు.

'టీ20ల్లో కొన్నిసార్లు మనం ఆడే షాట్లు బాగా అనిపించవు. దాంతో చెత్త షాట్‌ ఆడబోయి ఔటయ్యామని భావిస్తాం. అయితే రాహుల్‌ భాయ్‌ నాకో విషయం చెప్పాడు. అదేంటంటే.. మనం ఆడిన షాట్లు ఎలాంటివనే విషయం పట్టించుకోకూడదన్నాడు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ కేవలం బంతిని మాత్రమే చూసి బలంగా షాట్లు ఆడాలన్నాడు. ఏ షాట్‌ ఆడినా.. దాని మీద ఆ బ్యాట్స్‌మన్‌ ప్రభావం కనపడాలన్నాడు' అని అజింక్య రహానే తెలిపాడు.

'పొట్టి క్రికెట్‌లో నేను ఎవరి ఆటనూ అనుకరించను. నేను ఆడే షాట్లు నా నావే. ఒక షాట్‌ ఆడాలంటే దానిపై కచ్చితమైన అంచనా ఉండాలి. ఆడిన బంతులను బట్టి స్ట్రైక్‌రేట్‌ ఉండాలి, ఓవర్లను బట్టి మంచి స్కోర్‌ సాధించాలి' అని రహానే పేర్కొన్నాడు. వన్డే జట్టులో నెంబర్‌ 4లో కానీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తాను బ్యాటింగ్‌ చేయడానికి నెంబర్‌ 1లేదా నెంబర్‌ 4లో ఎంపిక చేసుకోమంటే.. నెంబర్‌ 1లోనే ఆడడానికి ఇష్టపడతానన్నాడు. తాను వన్డే జట్టులో తిరిగి ఆడతానని రహానే దీమా వ్యక్తం చేశాడు. వన్డే జట్టులో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరని, కానీ మానసికంగా అన్ని ఫార్మాట్‌లలో రాణించడానికి సిద్ధమని రహానే చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 13, 2020, 17:42 [IST]
Other articles published on Jul 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+