న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ డమాకా.. రోహిత్, కోహ్లీలు అలవోకగా గెలిచేశారు!!

‘If they are set, its tough to get them out’ – Jadeja on Kohli-Sharma stand

హైదరాబాద్: భారత్‌-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి మెరుపు శతకాలు బాది విండీస్‌ను మరోసారి చిత్తు చేశారు. 323 పరుగుల భారీ లక్ష్యం టీమిండియా ముందున్నా.. ఏ మాత్రం తడబడకుండా అలవోకగా గెలిచేశారు. కేవలం రెండే రెండు వికెట్లు కోల్పోయి.. ఇంకా 47 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.

ఆదివారం కోహ్లి, రోహిత్‌.. ఇద్దరూ అద్భుతమైన షాట్లతో అలరించారు. అందులో ఎన్నదగ్గవి రెండున్నాయి. రోచ్‌ వేసిన 29వ ఓవర్లో కోహ్లి ఫ్లిక్‌తో అలవోకగా మిడ్‌వికెట్‌వైపు సిక్సర్‌ బాది కళ్లు చెదిరిపోయేలా చేశాడు. ఇక థామస్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రోహిత్‌ నటరాజు పోజుతో పుల్‌ చేస్తూ స్క్వేర్‌లెగ్‌లో అద్భుతమైన సిక్సర్‌ బాదాడు. 8 వికెట్ల తేడాతో విండీస్‌పై గెలిచి టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో ఘనమైన బోనీ కొట్టింది.

దీంతో ట్విటర్‌ వేదికగా టీమిండియా ఆటగాళ్లపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ భావన చెప్పలేనిది. కానీ, విరాట్-రోహిత్‌ల కాంబినేషన్‌లో రికార్డుల మోత ఇలా చాలాసార్లు జరిగింది.

'రోహిత్ మరో ఎండ్‌లో ఉండగా ఏదీ కష్టం కాదు' అంటోన్న కెప్టెన్ కోహ్లీ అభిప్రాయంతో కలిపి.. వన్డే క్రికెట్‌లో రోహిత్, కోహ్లీ ఐదో డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలా మరే జోడి ఇప్పటి వరకూ ఆడలేదు' అని ఐసీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

‘If they are set, its tough to get them out’ – Jadeja on Kohli-Sharma stand

'డబుల్‌ ధమాకా. కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌ లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుంటే చూడటానికి ఎంతో బావుంది. ఆరోసారి 150 పరుగులు చేసిందుకు రోహిత్‌కు శుభాకాంక్షలు'.

1
44266

'70ల కాలంనుంచి భారతీయ క్రికెట్‌ గర్వించదగ్గ బ్యాట్స్‌మెన్స్‌ వస్తూనే ఉన్నారు. ఈ తరానికి విరాట్‌ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్‌ ఉన్నందుకు భారతీయ క్రికెట్‌ ఎంతో అదృష్టం చేసుకుంది. పరుగులు సాధించాలనే అతడి తపన అమోఘం. టీమిండియాకిది గొప్ప విజయం'.

'గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఇలా స్టంపౌట్‌ కావడం రెండోసారి. అయితేనేం మెరుపు షాట్లు బాది టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్‌ను తక్కువ అంచనా వేయకూడదని ఈ మ్యాచ్‌లో అర్థమైంది'.

'వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ శతకాలు చేశారు. ఇద్దరూ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి దూకుడును ఎవరూ ఆపలేరు. రెండు గొప్ప శతకాలు.ఓ గొప్ప భాగస్వామ్యం. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఇరగదీశారు. టీమిండియాకిది అత్యంత గొప్ప విజయం'.

'గొప్ప విజయం సాధించినందుకు టీమిండియాకు శుభాకాంక్షలు. కోహ్లీ ప్రదర్శన అత్యద్భుతం. ఇక రోహిత్‌ శర్మ గువాహటి మైదానాన్ని ఆక్రమించేశాడు'.

Story first published: Monday, October 22, 2018, 15:20 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X