న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాండ్యా.. స్టోక్స్‌ను చూసి నేర్చుకుంటే మంచి ప్లేయర్ అవుతాడు'

If hardik Learns From Stokes it Could be Defining Series him Ian Chapell
 If Hardik learns from Stokes, it could be defining series for him: Ian Chappell

హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా సమిష్టి సహకారం లోపంతో ఓటమికి గురైందంటూ విమర్శలు వస్తున్నాయి. విజయం సాధిస్తారు అనుకున్న తరుణంలో టీమిండియా ఒట్టి చేతుల్తో మిగలడం పట్ల ఇండియాతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజాలు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈ విధంగా తెలిపాడు. హార్దిక్‌ పాండ్య ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు.

1
42374
స్టోక్స్‌ చూసి నేర్చుకోగలిగితే పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా:

స్టోక్స్‌ చూసి నేర్చుకోగలిగితే పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా:

‘నిఖార్సైన సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోసం టీమిండియా ఎదురుచూపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్య గొప్ప పట్టుదల, క్రమశిక్షణ కనబరిచి కోహ్లితో కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం వల్ల అతని ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశముంది. అలాగే స్టోక్స్‌ బౌలింగ్‌ను చూసి అతను నేర్చుకోగలిగితే పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా రాణించే వీలుంది' అని చాపెల్‌ తెలిపాడు.

1938 యాషెస్‌ సిరీస్‌లో స్టాన్‌ మెకాబె

1938 యాషెస్‌ సిరీస్‌లో స్టాన్‌ మెకాబె

ప్రస్తుత సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ను చూసి నేర్చుకుంటే హార్దిక్ మంచి ప్రదర్శన చేసే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సాధించిన సెంచరీని.. 1938 యాషెస్‌ సిరీస్‌లో స్టాన్‌ మెకాబె చేసిన అద్భుతమైన ద్విశతకంతో చాపెల్‌ పోల్చాడు.

91 పరుగుల్లో 82 కోహ్లీనే..

91 పరుగుల్లో 82 కోహ్లీనే..

అండర్సన్‌ సవాలును పోరాట పటిమతో ఎదుర్కొని చివరిద్దరి బ్యాట్స్‌మన్‌ సాయంతో సాధించిన మొత్తం 91 పరుగుల్లో 82 పరుగులు కోహ్లీనే చేయడం అద్భుతం. 1938లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మెకాబె పూర్తి ఆధిపత్యంతో సాధించిన ద్విశతకానికి ఇది ఏ మాత్రం తీసిపోదు. ఆ ఇన్నింగ్స్‌ చూసిన అప్పటి కెప్టెన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ‘ఇలాంటి ఇన్నింగ్స్‌ను మళ్లీ చూడలేం' అని సహచరులతో అన్నాడు.

స్లిప్‌ ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమైన రెండు జట్లు

స్లిప్‌ ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమైన రెండు జట్లు

భారత్‌, ఇంగ్లాండ్‌ రెండు జట్లు స్లిప్‌ ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాయని అతను తెలిపాడు. ‘స్లిప్‌ ఫీల్డింగ్‌లో రెండు జట్లు ఘోరంగా విఫలమయ్యాయి. ఫీల్డర్లు దగ్గర దగ్గరగా నిల్చోవడంతో అయోమయంలో క్యాచ్‌లు వదిలేశారు. దాంతో బౌలర్ల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది' అని చాపెల్‌ వివరించాడు. ఇంగ్లాండ్‌ విజయంలో శామ్‌ కరన్‌, స్టోక్స్‌ కీలక పాత్ర పోషించారని అతను తెలిపాడు.

Story first published: Monday, August 6, 2018, 11:52 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X