న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ భారత క్రికెట్ జట్టులోకి యువరాజ్..?: సెహ్వాగ్

If Ashish Nehra can make a comeback at 36, why not Yuvraj Singh: Virender Sehwag

హైదరాబాద్: వెటరన్‌ క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ మళ్లీ భారత జట్టులోకి రాగలడనే ధీమాని వ్యక్తం చేస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్‌. మళ్లీ కోహ్లీ సేనలో చేరి తన అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలడనే నమ్మకాన్ని యువరాజ్‌‌పై కనబరుస్తున్నాడు. 36 ఏళ్ల యువరాజ్ బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్ట్‌లోనూ, ఫిట్‌నెస్ లోనూ పాసై జట్టులోకి ప్రవేశించేందుకు తయారుగా ఉన్నాడు.

ఇదే విషయమై, భారత జట్టులోకి పునరాగమం చేయగలడా అని ప్రశ్నించినప్పుడు.. 'అది సెలక్టర్ల చేతుల్లో ఉంది. అతడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తే లేదా యోయో పాసై.. ఎందుకు తిరిగి జట్టులోకి రాడు? 36 ఏళ్ల వయసులో నెహ్రా జట్టులో స్థానం సంపాదించినప్పుడు యువీ ఎందుకు సంపాదించలేడు? అతడొక అద్భుతమైన ఆటగాడు. ' అని సెహ్వాగ్‌ అన్నాడు.

నెహ్రా అక్టోబరు 2017లో తన రిటైర్ మెంట్‌ను ప్రకటించాడు. కానీ, సెహ్వాగ్ దృష్టిలో యువరాజ్ ఇంకా ఆడగలడనే బలమైన నమ్మకం ఉంది.

యువరాజ్‌ సింగ్‌లో పదును తగ్గిందన్న విమర్శకుల వాదనతో అతడు అంగీకరించలేదు. అంతేగాక, 'ఏ ఫార్మాట్ అనేది పక్కన పెడితే నేను ఇప్పటికీ ఆడుతున్నాను. ప్రతి రోజు నా వల్ల అయినంతవరకు మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 2019వరకు క్రికెట్ ఆడుతూనే ఉండడానికి ప్రయత్నిస్తాను. రోజురోజుకూ వయసు పెరుగుతున్నా నేను మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే భావనతోనే ముందుకు సాగుతున్నాను. వేరే వాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, నాకు మాత్రం ఆడగలననే నమ్మకం నా మీద నాకు ఉంది.' అని యువరాజ్ వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 21, 2018, 11:18 [IST]
Other articles published on Jan 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X