న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి నిమిషంలో స్వల్ప మార్పు: వరల్డ్ XI జట్టు కెప్టెన్‌గా అఫ్రిది

By Nageshwara Rao
ICC World XI vs West Indies: Eoin Morgan ruled out due to fractured finger; Shahid Afridi to lead Rest of World

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట వెస్టిండిస్‌తో జరిగే టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ స్థానంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు.

ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తమ అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో మిడిలెసెక్స్ తరఫున బరిలోకి దిగిన ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కుడిచేతి వేలుకు గాయం కావడంతో విండిస్‌తో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.

గురువారం జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి ఐసీసీ అంతర్జాతీయ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు.

గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్‌సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్‌లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి.

వీటిని పునరుద్ధరణ పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐసీసీ వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్‌ నుంచి షోయబ్‌ మాలిక్‌, షాహిద్‌ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్‌ అల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌(బంగ్లాదేశ్‌), రషీద్‌ ఖాన్‌ (అప్ఘనిస్తాన్‌)లను ఎంపిక చేయగా భారత్‌ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది.

అయితే చివరి నిమిషంలో హార్దిక్ పాండ్యా స్థానంలో పేసర్ మహమ్మద్ షమీని ఐసీసీ ఎంపిక చేసింది. మరోవైపు, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కొత్తగా తీసుకున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, వరల్డ్ ఎలెవన్‌ ఢీకొనబోతున్న 13 మంది సభ్యులతో కూడిన వెస్టిండిస్ జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), షకీబుల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, తిసార పెరీరా, రషీద్‌ ఖాన్‌, మహమ్మద్ షమీ, లూక్‌ రోంచి, మెక్లినగన్‌

వెస్టిండిస్‌:
కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, రయాద్‌ ఎమ్రిత్‌, ఆండ్రూ ఫ్లెచర్‌, క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, అశ్లే నర్స్‌, కీమోపాల్‌, రోవ్‌మాన్‌ పొవెల్‌, దినేష్‌ రామ్‌డిన్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రూ రస్సెల్‌, సామ్యుల్‌ బద్రీ, మార్లాన్‌ సామ్యుల్స్‌, కెస్రిక్‌ విలియమ్స్‌

Story first published: Wednesday, May 30, 2018, 15:07 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X