న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో స్ట్రీకర్: స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌తో మైదానంలోకి!

ICC World Cup 2019: Pitch invader tries to interrupt World Cup 2019 final at Lords

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ మహిళ మైదానంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌ను ధరించిన ఓ మహిళ అమాంతం మైదానంలోకి దూసుకొచ్చింది. అయితే, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ జట్టు స్కోరు వికెట్ నష్టానికి 45 పరుగుల వద్ద ఉండగా ఆ మహిళ మైదానంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ మహిళ ఓ అడల్ట్ వెబ్‌సైట్‌కు చెందిన పదాలను తన డ్రెస్‌పై రాసుకుంది. అయితే, ఆ మహిళ ఓ వెబ్‌సైట్ ప్రచారం కోసమే మైదానంలోకి దూసుకొచ్చినట్లు మ్యాచ్ నిర్వాహకులు ఆ తర్వాత నిర్దారణకు వచ్చారు.

కాగా, అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రం ఫర్వాలేదనిపించారు. ఇక, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్‌లకు చెరో 3 వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు చెరొ వికెట్ తీశారు.

ICC World Cup 2019: Pitch invader tries to interrupt World Cup 2019 final at Lords

ఇదే తొలిసారి కాదు
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ మైదానంలోకి దూసుకు రావడం ఇదే తొలిసారి కాదు. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. పైనల్లో లివర్ పూల్, టోటెన్హమ్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో 18వ నిమిషంలో రష్యాకు చెందిన ప్రముఖ మోడల్ కిన్సే వోలాన్స్‌స్కీ అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది.

సెక్యూరిటి సిబ్బందిని తప్పించుకుని గ్రౌండ్‌ మొత్తం పరుగులు తీసింది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించి వేశారు. ఈ విషయాన్ని వోలాన్స్‌స్కీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. "ఈ రోజు చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది' అంటూ స్విమ్ సూట్‌లో ఉన్న ఫోటోని పోస్టు చేసింది.

Story first published: Sunday, July 14, 2019, 21:00 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X