న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారం రోజుల క్రితం మలింగ షర్ట్‌లెస్‌ ఫొటోతో ట్రోలింగ్... ఇప్పుడేమో ప్రశంసల వర్షం

ICC Cricket World Cup 2019:'It's Not About The Six pack,It's About The Skill':Jayawardene On Malinga
ICC World Cup 2019: Malinga on a mission was exactly what Sri Lanka needed, opines Mahela Jayawardene

హైదరాబాద్: తన శరీరాకృతిపై వచ్చిన తీవ్ర విమర్శలకు తన ఆటతోనే బదులిచ్చాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించడంలో మలింగ పాత్ర ఎంతో కీలకం. ఈ ప్రపంచకప్‌లో 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక సెమీస్ ఆశలను సజీవంగా ఉంచాడు. వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో మలింగ షర్ట్‌లెస్‌ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. మలింగ శరీరాకృతిని ప్రస్తావిస్తూ అభిమానులు అభ్యంతరకరమైన పదజాలంతో తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఆ విమర్శలకు మలింగ తన ఆటతీరుతోనే బదులిచ్చాడు.

ఈ మ్యాచ్‌‌లో ఏంజెలో మ్యాథ్యూస్ 115 బంతుల్లో 85(5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా అవిష్కా ఫెర్నాండో 39 బంతుల్లో 49(6 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ 68 బంతుల్లో 46(2ఫోర్లు) ఫరవాలేదనిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

233 పరుగుల విజయ లక్ష్యం

233 పరుగుల విజయ లక్ష్యం

దీంతో ఆతిథ్య జట్టుకు 233 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లాండే విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, బౌలింగ్ బౌలింగ్ దెబ్బకు బెయిర్‌స్టో డకౌట్‌ కాగా.. ఓపెన్ విన్స్‌ (14), కెప్టెన్‌ మోర్గాన్‌ (21), జోస్ బట్లర్‌ (10‌)లు తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ బాటపట్టారు. ముఖ్యంగా మలింగ ఇంగ్లాండ్ టాపార్డర్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

లోయర్‌ ఆర్డర్‌ పని పట్టిన ధనంజయ డిసిల్వా

లోయర్‌ ఆర్డర్‌ పని పట్టిన ధనంజయ డిసిల్వా

ఇక, ధనంజయ డిసిల్వా (3/32) లోయర్‌ ఆర్డర్‌ పనిపట్టడంతో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగుల వద్దకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ "స్టోక్స్‌ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు" అని అన్నాడు.

స్టాక్‌బాల్స్‌‌ వ్యూహంతో కట్టడి చేశాం

స్టాక్‌బాల్స్‌‌ వ్యూహంతో కట్టడి చేశాం

"ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్‌బాల్స్‌‌ వ్యూహంతో కట్టడి చేశాం. లూజ్ బంతులు వేయకుండా.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం" అని మలింగ తెలిపాడు.

లంక విజయంలో కీలకపాత్ర

లంక విజయంలో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శ్రీలంక మాజీకెప్టెన్‌ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్‌' అని అన్నాడు. ‘ఓ పుస్తకం కవర్‌ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్‌ అద్భుతం' అంటూ మలింగా షర్ట్‌లెస్‌ ఫొటోను జత చేస్తూ ట్వీట్‌ చేశాడు.

Story first published: Saturday, June 22, 2019, 16:37 [IST]
Other articles published on Jun 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X