న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ 2019: కొనలేని స్థితిలో భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు

By Nageshwara Rao
ICC World Cup 2019: India vs Pakistan and details of other match ticket prices

హైదరాబాద్: కోల్‌కతాలో జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రారంభ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరగనుందన్న సస్పెన్స్ వీడిపోయింది.

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య మే 30న ఓవల్‌లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం పది దేశాలు తలపడనున్నాయి. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు.

2019 వరల్డ్ కప్‌కు ఓ ప్రత్యేకత

ఈ వరల్డ్ కప్‌కు ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేక ఏంటంటే 2015 వరల్డ్‌కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోలా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తలపడడం లేదు. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో భాగంగా జూన్ 5న దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్‌లో తలపడనుంది.

పాకిస్థాన్‌తో జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో

పాకిస్థాన్‌తో జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో

ఇక, జూన్ 16న టీమిండియాతో పాకిస్థాన్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తలపడనుంది. భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అభిమానులతో హౌస్ పుల్ అవుతుందని టోర్నీ నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను నాలుగు భాగాలుగా విభజించారు. ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్.

భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలివే

భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలివే

ప్లాటినమ్ టికెట్ ఖరీదుని £235గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలు రూ. 21, 833వేలు అన్నమాట. ఇక, బ్రాంజ్ టికెట్ ఖరీదుని £70 ( రూ. 6503)గా నిర్ణయించారు. చిన్నపిల్లలకు ప్రత్యకేమైన ధరలను నిర్ణయించారు. గోల్డ్ సెక్షన్ విభాగంలో చిన్నపిల్లలకు టికెట్ ధరను £30 ( రూ. 2787)గా నిర్ణయించగా, బ్రాంజ్ సెక్షన్ విభాగంలో చిన్న పిల్లలకు £6 (రూ. 557)గా నిర్ణయించారు. ఇక, ఈ మ్యాచ్‌కి సంబంధించి అత్యధిక టికెట్ ధరను £395 (రూ. 36, 688) ఉండగా, అత్యల్ప ధర £95 (రూ. 8823)గా ఉంది.

1992లో వరల్డ్ కప్‌లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో

1992లో వరల్డ్ కప్‌లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో

ఇదే వేదికపై ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోపాటు తొలి సెమీఫైనల్ కూడా జరగనుంది. మరో సెమీఫైనల్ జూలై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. అంతేకాదు ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను 1992లో వరల్డ్ కప్‌లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. 2019 వరల్డ్ కప్‌లో భారత షెడ్యూల్ ఇలా ఉంది.

Story first published: Friday, April 27, 2018, 16:08 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X