న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC World Cup 2019: ఆప్ఘన్‌తో మ్యాచ్: కోహ్లీసేనకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌యేనా?

ICC Cricket World Cup 2019 : India v Afghanistan Match Preview || Oneindia Telugu
ICC World Cup 2019: India Vs Afghanistan: Kohlis men find balance between rest and preparation

హైదరాబాద్: ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో పసికూన ఆప్ఘనిస్థాన్‌తో కోహ్లీసేనతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో
పేస్‌ బలమున్న ప్రత్యర్థులపై నెగ్గుతూ వచ్చిన టీమిండియా, ఇప్పుడు స్పిన్‌ ప్రధాన అస్త్రమైన జట్టును ఎదుర్కోనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ రేసులో మరింత ముందుకెళ్తుంది. పసికూనతో మ్యాచ్ కావడంతో పనిలో పనిగా ఒకరిద్దరు ఆటగాళ్లకు తగిన ప్రాక్టీస్‌ కల్పించే మ్యాచ్‌గా కూడా మారనుంది. భువనేశ్వర్‌ స్థానంలో మొహమ్మద్‌ షమీని తీసుకోవడం ఒక్కటే భారత్‌ తుది జట్టులో చేయనున్న మార్పుగా కనిపిస్తోంది.

1
43671

విజయ్‌ శంకర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే

మరోవైపు ప్రాక్టీస్‌లో బుమ్రా బంతికి గాయపడిన ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే అతడి స్థానంలో దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్‌లలో ఒకరికి స్థానం దక్కొ చ్చు. మిడిలార్డర్‌లో కేదార్‌ జాదవ్‌కు ఇంతవరకు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ దక్కలేదు. మూడు మ్యాచ్‌ల్లో అతడు కేవలం 8 బంతులే ఎదుర్కొన్నాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేసే అవకాశం

ఇక, జట్టు అవసరాలరీత్యా జాదవ్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌ రోహిత్‌ రెండు సెంచరీలతో ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు సెంచరీ నమోదు చేయలేదు. దీంతో కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తాడోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఓపెనర్‌గా పూర్తిస్థాయిలో సిద్ధమైన కేఎల్ రాహుల్

ఇకపై టోర్నీ అంతా పూర్తిస్థాయి ఓపెనర్‌గా బాధ్యత మోయాల్సిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ అందుకు పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తున్నాడు. ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్‌కు ప్రపంచ అత్యుత్తమ బౌలర్ బుమ్రాను ఎదుర్కొనడం ఇబ్బందే. చైనామన్ స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌ బౌలింగ్ ఆడటం వారి శక్తికి మించిన పనే.

విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని

ఇక, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ వంటి బౌలర్‌ అర్ధంతరంగా వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, అతడి లోటును తెలియకుండా హార్దిక్ పాండ్యా, విజయ్‌ శంకర్ చక్కగా రాణించారు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య రెండు వన్డేలు

ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య రెండు వన్డేలు

ముఖాముఖి పోరు విషయానికి వస్తే రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు వన్డేలే జరిగాయి. అవి కూడా 2014, 2018 ఆసియా కప్‌లలో భాగంగానే జరికాయి. వీటిలో భారత్‌ ఒక మ్యాచ్‌ విజయం సాధించగా మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా ఆప్ఘన్ ఆఖరి స్థానంలో ఉంది.

ఆరెంజ్ రంగు జెర్సీతో బరిలోకి

ఆరెంజ్ రంగు జెర్సీతో బరిలోకి

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. రెండు జట్ల దుస్తులు ఒకే రంగులో ఉన్నప్పుడు అందులో ఒక జట్టు భిన్నమైన రంగు జెర్సీ వేసుకోవాలని ఐసీసీ కొత్తగా నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆప్ఘన్‌తో పాటు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీసేన బ్లూ రంగు జెర్సీల బదులు ఆరెంజ్ రంగు జెర్సీలు ధరించనున్నారు.

Story first published: Saturday, June 22, 2019, 10:03 [IST]
Other articles published on Jun 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X