న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈ వరల్డ్‌కప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి టీమిండియానే'

ICC Cricket World Cup 2019 : Team India Powerplay Well With Rohit And Dhawan Says Hussain | Oneindia
ICC World Cup 2019: India a Big Threat as They Have Every Base Covered: Hussain

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి టీమిండియానేనని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్ తెలిపాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో పాటు ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌, ఇండియా టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో మెట్రో.కో.యుకే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో నాసిర్‌ హుస్సేన్ మాట్లాడుతూ "ఈసారి ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్‌. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మలతో పాటు ఉత్తమ ఫినిషర్‌ ధోనీ కూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం" అని అన్నాడు.

ఏ జట్టుకూ లేని రికార్డు భారత్ సొంతం

ఏ జట్టుకూ లేని రికార్డు భారత్ సొంతం

"పవర్ ప్లేలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడతారు. వీరిద్దరి తర్వాత కోహ్లీ... వైట్ బాల్ క్రికెట్‌లో ఛేదనలో ఏ జట్టుకూ లేని రికార్డు ఈ జట్టు సొంతం. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవాలంటే ప్రతి జట్టు భారత్‌ను దాటాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌ విషయంలో నంబర్‌ వన్‌ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్‌ ఉండటం అదనపు బలం" అని నాసిర్ హుస్సేన్ తెలిపాడు.

డెత్‌ ఓవర్లలో బుమ్రా సూపర్

డెత్‌ ఓవర్లలో బుమ్రా సూపర్

"పవర్‌ప్లేతో పాటు డెత్‌ ఓవర్లలో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా తిప్పలు పెట్టే సత్తా బుమ్రాకు ఉంది. భువనేశ్వర్‌ కూడా అంతే. ఇంగ్లాండ్ పిచ్‌లు పూర్తిగా భిన్నం. స్పిన్ ఆప్షన్స్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ... గత కొన్ని సంవత్సరాలుగా భారత పేస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా ఉంది" అని నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు.

అగ్రస్థానంలో ఇంగ్లాండ్

అగ్రస్థానంలో ఇంగ్లాండ్

ఇక, ఇంగ్లాండ్‌ విషయానికి వస్తే ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంతో వరల్డ్‌కప్ బరిలోకి దిగుతోంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ వేదికకానుంది.

Story first published: Sunday, May 19, 2019, 13:08 [IST]
Other articles published on May 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X