న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20: ఇండియా Vs ఆస్ట్రేలియా, విజయమెవరిదో, మ్యాచ్ టైమింగ్?

ICC Women's T20 World Cup : India vs Australia Preview And Prediction | Oneindia Telugu
ICC Womens World T20: India vs Australia: Preview, timing, where to watch, squads

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో మహిళల వరల్డీ టీ20లో భారత మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత మహిళల జట్టు వరల్డ్ టీ20 సెమీస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. శనివారం జరిగే గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రపంచ చాంపియన్‌షిప్‌: మనీషా పంచ్‌ల వర్షం, భారత్ శుభారంభంప్రపంచ చాంపియన్‌షిప్‌: మనీషా పంచ్‌ల వర్షం, భారత్ శుభారంభం

ఈ గ్రూప్‌ నుంచి ఇరు జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెరో ఆరు పాయింట్లతో గ్రూప్‌లో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా నెగ్గితే అగ్రస్థానంలోకి వస్తుంది. లేదంటే కంగారూలు మరింత పదిలం చేసుకుంటారు.

సెంచరీతో టోర్నీకి అదిరిపోయే ఆరంభం

సెంచరీతో టోర్నీకి అదిరిపోయే ఆరంభం

న్యూజిలాండ్‌పై సెంచరీతో టోర్నీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆ తర్వాత రెండు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న మిథాలీ రాజ్ బ్యాటింగ్‌లో మరోసారి కీలకం కానున్నారు. స్మృతి మంధాన గత మ్యాచ్‌లో రాణించడంతో ముగ్గురు సీనియర్‌ క్రికెటర్లు కూడా ఫామ్‌లో ఉన్నారు. వీరిలో కనీసం ఇద్దరు బాగా ఆడినా జట్టుకు మంచి విజయావకాశాలుంటాయి. మిడిలార్డర్‌లో వేదా కృష్ణమూర్తి, హేమలత, దీప్తి శర్మ మెరువాల్సిన సమయం ఆసన్నమైంది. బౌలింగ్‌లో టీమిండియా బౌలర్లు అంచనాలు అందుకుంటున్నారు. పేసర్లు వికెట్లు తీయకపోయినా.. స్పిన్ త్రయం దీప్తి, పూనమ్, రాధా చెలరేగిపోతున్నారు.

పూనమ్‌ యాదవ్‌ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో

పూనమ్‌ యాదవ్‌ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో

లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీస్తోంది. కేవలం 12 స్ట్రయిక్‌ రేట్‌తో ఆమె 6 వికెట్లు తీసింది. ఐదేసి వికెట్లు తీసిన రాధా యాదవ్, హేమలత కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు మ్యాచ్‌లలో ఒక్కో పేసర్‌నే భారత్‌ ఆడించింది. తొలి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి ఆడగా, ఐర్లాండ్‌పై మాన్సి జోషి పొదుపైన బౌలింగ్‌ చేసింది. గత మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన పేసర్ మాన్షి జోషీ స్థానంలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

సమతూకంతో ఉన్న ఆస్ట్రేలియా జట్టు

సమతూకంతో ఉన్న ఆస్ట్రేలియా జట్టు

ఇక, ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే, సమతూకంతో ఉంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 52 పరుగులతో ఘన విజయం సాధించిన ఆ జట్టు, ఆ తర్వాత ఐర్లాండ్‌ను 9 వికెట్లతో, న్యూజిలాండ్‌ను 33 పరుగులతో చిత్తు చేసింది. ముఖ్యంగా స్టార్‌ ప్లేయర్‌ అలీసా హీలీ ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తోంది. ఈ టోర్నీలో 157 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు సునాయాస అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కెప్టెన్ లానింగ్, ఆల్‌రౌండర్ పెర్రీ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇక, మిడిలార్డర్‌లో గార్డెనర్, విలానీ, హైన్స్ మోస్తున్నారు.

ఆసీస్ విజయాల్లో మెగాన్‌ షుట్‌ కీలకపాత్ర

ఆసీస్ విజయాల్లో మెగాన్‌ షుట్‌ కీలకపాత్ర

బౌలింగ్ విషయానికి వస్తే పేస్‌ బౌలర్‌ మెగాన్‌ షుట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. మూడు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు తీసిన షుట్‌ ఓవర్లో ఐదు పరుగులకు మించి ఇవ్వలేదు. షుట్‌ కాకుండా ఈ వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా మరో ఐదుగురు బౌలర్లను ఉపయోగించగా వారంతా తలా మూడు వికెట్లతో సత్తా చాటడం విశేషం. కెరీర్‌లో 100వ టి20 మ్యాచ్‌ ఆడబోతున్న సీనియర్‌ పేసర్‌ ఎలైస్‌ పెర్రీ కూడా భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు దూకుడుగా ఆడుతుండటంతో ఈ చివరి లీగ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), మిథాలీరాజ్‌, జెమిమా, వేద కృష్ణమూర్తి, దీప్తిశర్మ, తానియా భాటియా, పూనమ్‌ యాదవ్‌, రాధ యాదవ్‌, అనుజ పాటిల్‌, ఏక్తా బిస్త్‌, హేమలత, మాన్సి జోషి, పూజ, అరుంధతి రెడ్డి

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), రేచల్‌ హేన్స్‌, నికోల్‌ బోల్టాన్‌, గార్డ్‌నర్‌, అలెసా హీలీ, కిమిన్స్‌, సోఫి, మూనీ, పెర్రీ, షట్‌, విలాని, తాల్యా, జార్జియా, నికోలా కారె.

టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్‌లో రాత్రి 8.30 గంటలకు

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

Story first published: Saturday, November 17, 2018, 11:56 [IST]
Other articles published on Nov 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X